https://oktelugu.com/

T Series: యూట్యూబ్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన టీ సిరీస్…

T Series: భూషణ్ కుమార్‌కు చెందిన టీ -సిరీస్ భారతదేశం లోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. టీ -సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి. కాగా తాజాగా యూట్యూబ్‌లో టీ -సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ -సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా టీ -సిరీస్ అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 08:37 PM IST
    Follow us on

    T Series: భూషణ్ కుమార్‌కు చెందిన టీ -సిరీస్ భారతదేశం లోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. టీ -సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి. కాగా తాజాగా యూట్యూబ్‌లో టీ -సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ -సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా టీ -సిరీస్ అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ ఈ ఫీట్ సాధించలేదు. కాగా ఈ విజయాన్ని సంస్థ సభ్యులకు, మ్యూజిక్ టీమ్‌కు అంకితం చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ప్రకటించారు.

    ఇంత పెద్ద స్థాయిలో తమ ఛానల్ సబ్‌స్రైబర్‌లను పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్‌కు చెందిన ఓ మ్యూజిక్ సంస్థ ఈ ఘనత సాధించడం భారతీయులు అందరికీ గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా యూట్యూబ్‌లో టీ -సిరీస్ పేరుతో వేర్వేరు భాషల్లో 29 ఛానెళ్లు ఉన్నాయి. టీ -సిరీస్ కు చెందిన ఈ ఛానళ్లు అన్నింటికి కలిపి ఇప్పటివరకు 718 బిలియన్‌లకు పైగా వీక్షణలు వచ్చినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ పాటలు కూడా టీ -సిరీస్ ద్వారానే విడుదల అవుతున్నాయి. కాగా ఈ పాటలకు కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్, లైక్స్ లభిస్తుండడం తెలిసిన విషయమే. రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘రాధే శ్యామ్’… పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది.