Hero Kalyan Ram: త్రిపాత్రాభినయంలో నటించేందుకు రెడీ అయిన కళ్యాణ్ రామ్…

Hero Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. ప్రస్తుతం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ .కె నిర్మిస్తున్న సినిమా “బింబిసార” సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… అనేది ఉపశీర్షిక. ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 6, 2021 8:49 pm
Follow us on

Hero Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. ప్రస్తుతం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ .కె నిర్మిస్తున్న సినిమా “బింబిసార” సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వ‌శిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ కి ఇది 18వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాను మొదలుపెట్టారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ… మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు కళ్యాణ్ రామ్. కాగా ప్రస్తుతం ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ మూవీతో పాటు ‘డెవిల్’ అనే మరో సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.