https://oktelugu.com/

Rakesh Master- Swathi Naidu: రాకేష్ మాస్టర్ మరణం వెనుక ‘స్వాతి నాయుడు’.. సంచలన నిజం వెలుగులోకి..

రాకేష్ మాస్టర్ కు అత్యంత సన్నిహితుల్లో హేమంత్ ఒకరు. ఈయన యూట్యూబ్ చానెల్ ద్వారా జూనియర్ శ్రీహరిగా గుర్తింపు పొందాడు. రాకేష్ మరణంపై ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 24, 2023 / 09:41 AM IST

    Rakesh Master- Swathi Naidu

    Follow us on

    Rakesh Master- Swathi Naidu: ప్రముఖ డ్యాన్సర్ రాకేష్ మాస్టర్ మరణంపై రోజుకో న్యూస్ సంచలనం రేపుతోంది. జూన్ 18న ఆయన రక్తపు వాంతులు చేసుకొని ఆ తరువాత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత తాగుడుకు బానిసై ఆరోగ్యం క్షీణించిందని అందుకే మరణించాడని మరికొందరు అంటున్నారు. లేటేస్టుగా మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రాకేష్ మాస్టర్ ది సహజ మరణం కాదనే అర్థం వచ్చేలా ఆయన సన్నిహితుడు, జూనియర్ శ్రీహరి గా పిలవబడే హేమంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతినాయుడు కోసం గొడవ జరిగిందని ఆ తరువాత రాకేష్ మరణించాడని అంటున్నాడు. దీంతో రాకేష్ మాస్టర్ సహజ మరణమా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అన్న చర్చ సాగుతోంది.

    రాకేష్ మాస్టర్ కు అత్యంత సన్నిహితుల్లో హేమంత్ ఒకరు. ఈయన యూట్యూబ్ చానెల్ ద్వారా జూనియర్ శ్రీహరిగా గుర్తింపు పొందాడు. రాకేష్ మరణంపై ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. రాకేష్ మరణం ఎంతో బాధించిందని చెప్పారు. అయితే ఆయనది సహజ మరణం అని నేను అనుకోవడం లేదని అంటున్నారు. రాకేష్ చనిపోయే వరకు తనతో ఉన్నానని, ఆయన లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

    రాకేష్ మరణించే ముందు రోజు ఓ షూటింగ్ కోసం వెళ్లారు. ఆ తరువాత విశాఖ లోని ఓ రిసార్ట్ కు వచ్చారు. ఈ సమయంలో రాకేష్ మాస్టర్ ను కలిసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. ఈ సమయంలో రాకేష్ తో ఫొటోలు దిగడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే సమయంలో స్వాతి నాయడును తీసుకురావాలని పట్టుబట్టారు. ఈ విషయంలో అక్కడ గొడవ జరిగింది. అయితే రాకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు… అని హేమంత్ చెప్పారు.

    ఇక వారం రోజుల ముందు నుంచే రాకేష్ అనారోగ్యంతో ఉన్నారని కొందరు పోస్టులు పెడుతున్నారు. నెల రోజుల కిందటే ఆయన చనిపోతారని వైద్యులు తనతో చెప్పారని, కానీ ఆ విషయాన్ని రాకేష్ పట్టించుకోలేదని మరో సన్నిహితుడు పేర్కొంటున్నాడు. అయితే మద్యానికి బానిసై వారం రోజుల పాటు మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అన్నారు. ఏదీ ఏమైనా రాకేష్ మాస్టర్ మరణంపై ఇంకెన్ని వార్తలు బయటకు వస్తాయో చూడాలి.