Mahesh Babu- Namrata Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు ప్రత్యేకం. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రి బాటలోనే విభిన్న సినిమాల్లో నటిస్తూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ మిల్క్ భాయ్ మొదట్లో కేవలం లవ్ సినిమాలు మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు ఆల్ టైం మాస్ హీరో అనిపించుకుంటున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతలో మహేష్ పర్సనల్ విషయంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. మహేష్ నటి నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అడ్డుచెప్పాడట. అందుకే వీళ్లు ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారని టాక్. ఈ విషయం ఇన్నాళ్ల తరువాత బయటకు రావడంతో ఆసక్తిగా చర్చ సాగుతోంది.
మహేష్ బాబు వంశీ సినిమాలో నటిస్తున్న సమయంలో నమ్రతా శిరోద్కర్ పరిచయం అయింది. ఆ తరువాత ఇద్దరు ప్రేమికులుగా మారారు. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ విషయం మొదట తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు చెప్పాడు మహేష్. కానీ కృష్ణ వీరి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదట. ఎందుకంటే మహేష్ కు ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ నమ్రతా శిరోద్కర్ మాత్రం ముంబైకి చెందిన గార్ల్.
కృష్ణ వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ముంబై వెళ్లి సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఆ తరువాత మహేష్ తల్లి ఇందిర కృష్ణగారిని ఒప్పించారు. అలా ఇందిరి చెప్పిన మాటలకు కన్విన్స్ అయిన కృష్ణ ఆ తరువాత ఇద్దరూ కలిసి ముంబై వెళ్లి మహేష్ దంపతులను ఆశీర్వదించారట. ఆ తరువాత మహేష్ హైదరాబాద్ కు వచ్చి కొన్నాళ్లపాటు కృష్ణతో కలిసి ఉన్నాడు. సినిమాల్లోనే కాకుండా రియల్ గా మహేష్ జీవితంలో ప్రేమకు అడ్డు చెప్పే తండ్రి ఉన్నాడని అంతా అనుకుంటున్నారు.
ఇక మహేష్ త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయిన తరువాత రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 29. ఈ రోజున రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. మహేష్ తో సినిమా తీసేందుకు రాజమౌళి ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేసుకున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.