https://oktelugu.com/

Meenakshi Chaudhary: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఖిలాడి భామ… ఏకంగా మహేష్ పక్కన ఛాన్స్!

షూటింగ్ మొదలయ్యాక కూడా పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్. కానీ వారు ప్లాప్స్ లో డీలా పడ్డ పూజా ఫేమ్ కోల్పోయింది. దీంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : June 24, 2023 / 09:34 AM IST

    Meenakshi Chaudhary

    Follow us on

    Meenakshi Chaudhary: గుంటూరు కారం మూవీ నుండి పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. ఇందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్డేను సెకండ్ హీరోయిన్ చేసి, శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ చేశాడట. అందుకే శ్రీలీల అలిగి వెళ్లిపోయిందన్నారు. పూజా హెగ్డే టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. డేట్స్ అడ్జెస్ట్ కాకే ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూజా హెగ్డే పాత్రకు ప్రాధాన్యత లేని పక్షంలో ఆమె మూవీ చేయనని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారట.

    షూటింగ్ మొదలయ్యాక కూడా పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్. కానీ వారు ప్లాప్స్ లో డీలా పడ్డ పూజా ఫేమ్ కోల్పోయింది. దీంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. ఫస్ట్ ఆమెను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఊహించని షాక్ తిన్న పూజా మూవీ వదులుకున్నారు. ఇక పూజా ప్లేస్ ఎవరు రిప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతుండగా యంగ్ బ్యూటీ పేరు వెలుగులోకి వచ్చింది.

    దర్శకుడు త్రివిక్రమ్ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశాడంటున్నారు. అన్ని విధాలా మహేష్ కి మీనాక్షి చౌదరి చక్కని జోడీని భావించిన త్రివిక్రమ్ ఆమె వైపు మొగ్గు చూపాడట. మీనాక్షి చౌదరి ఖిలాడి మూవీలో రవితేజతో జతకట్టింది. అలాగే అడివి శేష్ కి జంటగా ‘హిట్ 2’ మూవీలో నటించింది. సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ మహేష్ పక్కన ఛాన్స్ అంటే మీనాక్షికి బంపర్ ఆఫర్ తగిలినట్లే. సంయుక్త మీనన్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఎందుకో త్రివిక్రమ్ మనసు మార్చుకుని మీనాక్షిని సెట్ చేశాడంటున్నారు.

    దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది. గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పులు రావడంతో ఆలస్యం అవుతుంది. సంక్రాంతికి విడుదల కష్టమే అంటున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. జులై లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుందట.