https://oktelugu.com/

బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?

తెలుగులో నాలుగు వారాల క్రితం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే గత సీజన్ల మాదిరిగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆకర్షించడంలో ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది. మరోవైపు బిగ్ బాస్ ఓటింగ్ విధానంపై కూడా ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనధికార పోల్స్ లో వచ్చిన ఫలితాలకు విరుద్ధంగా ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. గత వారం బిగ్ బాస్ షో నుంచి దేవిని ఎలిమినేట్ చేశారు. నిజానికి దేవితో పోలిస్తే మెహబూబ్ కు తక్కువ ఓట్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 4, 2020 / 08:44 AM IST
    Follow us on

    తెలుగులో నాలుగు వారాల క్రితం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే గత సీజన్ల మాదిరిగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆకర్షించడంలో ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది. మరోవైపు బిగ్ బాస్ ఓటింగ్ విధానంపై కూడా ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనధికార పోల్స్ లో వచ్చిన ఫలితాలకు విరుద్ధంగా ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. గత వారం బిగ్ బాస్ షో నుంచి దేవిని ఎలిమినేట్ చేశారు.

    నిజానికి దేవితో పోలిస్తే మెహబూబ్ కు తక్కువ ఓట్లు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా దేవి ఎలిమినేషన్ జరిగింది. దేవి నాగవల్లి బయటకు వచ్చిన తరువాత తన ఎలిమినేషన్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. తనకంటే తక్కువగా ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేయకుండా తనను ఎలిమినేట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. తాను గ్లామర్ షో చేయలేనని అందుకే తనను పంపించి ఉండవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

    దేవి ఎలిమినేషన్ ను మరవక ముందే స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ కూడా ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది. నిజానికి స్వాతి ఇంట్లో కనీసం వారం రోజులు కూడా లేదు. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే ఆమె వీక్ కంటెస్టెంట్ కూడా కాదు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగు పెట్టిన ఆమెను నామినేషన్ లోకి అనుమతించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    మరోవైపు ఈరోజు మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. సొహైల్ లేదా మెహబూబ్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు వారాల్లో రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.