
Swapnadut shocking comments: టాలీవుడ్ లో క్లాసికల్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం కచ్చితంగా ఉంటుంది.ఈ సినిమా ఆరోజుల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అంత తేలికగా మనం మర్చిపోగలమా.A రేటింగ్స్ తో వచ్చి కూడా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది.కలెక్షన్స్ సంగతి కాసేపు పక్కన పెడితే హీరో విజయ్ దేవరకొండ కి యూత్ లో ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చెక్కు చెదరని ఫ్యాన్ బేస్ ని ఏర్పరిచింది.
అయితే ఈ సినిమాని ముందుగా శర్వానంద్ తో చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, కానీ అడల్ట్ కంటెంట్ అవ్వడం తో ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకి ఉన్న ఇమేజి డ్యామేజీ అవుతుందేమో అనే భయం తో ఆయన ఈ సినిమా చెయ్యలేదు.ఇక అప్పుడే పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ కి వెళ్లి ఇదే కథ ని చెప్తే ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమాలో నటించాడు.
అయితే ఈ సినిమాని కేవలం శర్వానంద్ మాత్రమే కాదు, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ కూడా మిస్ చేసుకుందట.ఆమె నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు ‘అర్జున్ రెడ్డి’ కథని వినిపించాడని, కథ ఎంతో అద్భుతంగా నచ్చింది కానీ, ఆ సినిమా అటు ఇటు అయితే అమ్మాయి అయ్యుండి కూడా ఇలాంటి సినిమా తీసింది అంటూ సమాజం లో ఉన్న అందరూ నన్ను దూషిస్తారనే భయటంతోనే ఆ సినిమా చెయ్యలేదని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.
‘అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ అయ్యానే అని తల్చుకున్నప్పకుడల్లా నా కళ్ళలో నీళ్లు తిరగేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది స్వప్న దత్.మహానటి వంటి అద్భుతమైన సినిమాని నిర్మించిన స్వప్న దత్,ఆ తర్వాత సీతారామం వంటి మరో బ్లాక్ బస్టర్ ని నిర్మించింది.ఇప్పుడు ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ అనే భారీ బడ్జెట్ సినిమాని పాన్ వరల్డ్ స్కేల్ లో నిర్మిస్తుంది.