
Dussehra Movie Trailer: ప్రస్తుతం విడుదలకు సిద్ధం గా ఉన్న పాన్ ఇండియన్ మూవీ లో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న సినిమా ‘దసరా’.న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ఈ సినిమా పై ట్రేడ్ లో కూడా మామూలు అంచనాలు లేవు.ఎల్లప్పుడూ లవ్ స్టోరీస్ మరియు యూత్ ఫుల్ మూవీస్ చేస్తూ వచ్చే నాని నుండి, ఒక ఊర మాస్ సినిమా రావడం, అది కూడా బలమైన కంటెంట్ తో వస్తుండడం తో ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ మరియు పాటలకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.ఇలా అన్ని విధాలుగా చిత్రం పై పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే ఉన్నాయి.మార్చి 30 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 14 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్ ని నిన్న విడుదల చేసారు.రావణాసురిడి దిష్టి బొమ్మ ని హీరో నాని తగలబెడుతున్న సన్నివేశానికి సంబంధించిన షాట్ ని ఈ పోస్టర్ లో పెట్టారు.దీనికి నెటిజెన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది.కేవలం పోస్టర్ తోనే ట్రైలర్ పై అంచనాలు పెంచేశారు అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.ఇక ట్రైలర్ లో నాని మాట్లాడే తెలంగాణ యాస హైలైట్ గా ఉండబోతుందట.ఇందులో ఆయన సింగరేణి బొగ్గు గనులలో పనిచేసే కార్మికుడిగా నటించాడు,టీజర్ చివర్లో నేను నోట్లో కట్టి పెట్టుకొని , వేలు కోసి ఆ రక్తం తో బొట్టు పెట్టుకునే షాట్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరం చూసాము.
ట్రైలర్ మొత్తం అలాంటి షాట్స్ తో నింపేసారట.ఈ ట్రైలర్ తోనే ప్రేక్షకులకు మూవీ స్టోరీ ఏంటో దాదాపుగా తెలిసిపోతుందని, ఆడియన్స్ విడుదలకు ముందే ఈ చిత్రం మీద ఒక ఐడియా కి వచ్చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్.మరి హైప్ కి తగ్గట్టుగానే ట్రైలర్ ఉంటుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.