ఆమె ‘ఎస్వీయార్’నే నాలుగు దెబ్బలు కొట్టిందట !

తెలుగు వెండితెర ఏ నాడో చేసుకున్న పుణ్యం కారణంగా ఆయన నిండైన విగ్రహంతో తెలుగు తెరకు ఓ చరిత్ర పుట్టుకొచ్చింది. అదేంటో కొంతమంది నటులు నటించక్కర్లేదు, వాళ్ళు కనిపిస్తే చాలు రంగుల సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ప్లే అవుతాయి, అలాంటి వారిలో ఆయన మొదటి వ్యక్తి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ముందు సూపర్ స్టార్లు కూడా చిన్నబోయారు, ఆయన ఒక్కసారి కళ్లు చిట్లించి చూస్తే మహామహా నటులు కూడా హడలిపోయారు. ఇక ఆయన పెదవి విరిచి చిన్న […]

Written By: admin, Updated On : July 3, 2021 3:52 pm
Follow us on

తెలుగు వెండితెర ఏ నాడో చేసుకున్న పుణ్యం కారణంగా ఆయన నిండైన విగ్రహంతో తెలుగు తెరకు ఓ చరిత్ర పుట్టుకొచ్చింది. అదేంటో కొంతమంది నటులు నటించక్కర్లేదు, వాళ్ళు కనిపిస్తే చాలు రంగుల సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ప్లే అవుతాయి, అలాంటి వారిలో ఆయన మొదటి వ్యక్తి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ముందు సూపర్ స్టార్లు కూడా చిన్నబోయారు, ఆయన ఒక్కసారి కళ్లు చిట్లించి చూస్తే మహామహా నటులు కూడా హడలిపోయారు.

ఇక ఆయన పెదవి విరిచి చిన్న హమ్మింగ్ ఇస్తే కొమ్ములు తిరిగిన విలన్లు కూడా వణికిపోయారు. ఆయనే ఎస్‌. వి. రంగారావు. ఎస్వీయార్ కనపడగానే అప్పటి ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో గోల గోల చేసేవారు. ఆయన తల కొద్దిగా ఆడిస్తే చాలు, ఆ చిన్నపాటి రియాక్షన్ కే ప్రేక్షకులు మైమరచి పోయేవారు. ఆయనలో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన మాట పెదవి దాటకుండానే, భావం ఆయన ముఖంలో కనబడుతుంది.

అందుకే ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు, తాతయ్య, తండ్రిగా, మామయ్యగా ఇలా ఒకటి ఏమిటో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన పాదాల చెంత కాలక్షేపం చేసేవి. ఆయన చివరి వరకు నటనే శ్వాసగా జీవించారు. పైగా నటిస్తూనే తుదిశ్వాస విడిచారు. అయితే ఎస్వీఆర్ కు నటన అంటే ఎంత ఇష్టమో తెలిపే సంఘటన ఇది.

ఎస్వీఆర్ ను పెద్ద చదువులు చదివించాలనే ఉద్దేశంతో, వాళ్ల నాయనమ్మగారు చెన్నై ట్రిప్లికేన్‌ లో ఇల్లు అద్దెకు తీసుకుని మరి ఎస్వీఆర్ ను హిందూ హైస్కూల్‌ లో జాయిన్ చేసారు. కానీ ఎస్వీఆర్ కి చదువు మీద కంటే, సినిమాలంటేనే మక్కువ. అందుకే ప్రతిరోజూ సెకండ్‌ షోకి వెళ్లేవారు. ఇందుకోసం ముందు గదిలో పడుకునేవారు.

అయితే ఒకరోజు కరెంటు పోయింది. ఆ సమయంలో ఎస్వీఆర్ ను నిద్ర లేపడానికి వాళ్ల నాయనమ్మగారు వెళ్లారు. అక్కడ ఎస్వీఆర్ స్థానంలో తలగడలు ఉన్నాయి. దాంతో కోపంతో ఊగిపోయిన ఆవిడ, ఎస్వీఆర్ వచ్చేవరకు కూర్చుని, రాగానే బెత్తంతో గట్టిగా నాలుగు దెబ్బలు కొట్టిందట. ఆ తర్వాత ఆ గాయాలకు వెన్నె రాస్తూ కన్నీళ్లు తుడుచుకుంది. ఎస్వీఆర్ మాత్రం ఆమెను చూసి నవ్వుతూనే ఉన్నారు.