Manchu Manoj
Manchu Manoj : నేడు ఉదయం మంచు మనోజ్(Manchu Manoj) ని తిరుపతి(Tirupathi) సమీపంలోని భాకరాపేట పోలీస్ స్టేషన్ కి చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్త సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మంచు కుటుంబం లో చాలా కాలం నుండి విబేధాలు జరుగుతున్నాయి, మోహన్ బాబు(Manchu Mohanbabu) అనేక సార్లు మనోజ్ పై ఫిర్యాదు చేసాడు కాబట్టి, ఆ గొడవల కారణంగానే మనోజ్ ని అరెస్ట్ చేసి ఉంటారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అసలు నిజం అది కాదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మనోజ్ సోమవారం రోజున మనోజ్ తిరుపతి లోని చంద్రగిరి ప్రాంతంలో జరిగిన జల్లికట్టు సంబరాల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలు ముగిసిన తర్వాత రాత్రి బకరా పేట లోని ఘాట్ వాలీ లో ఉన్నటువంటి ‘లేక్ వాలీ రిసార్ట్'(Lake Valley Resort) లో బస చేసాడు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ కి వచ్చిన పోలీసులు లేక్ వాలీ రిసార్ట్ లో ఎవరెవరు ఉన్నారంటూ విచారించారు.
రిసార్ట్ సిబ్బంది మనోజ్ ఉన్నాడు అని తెలియచేయగా, పోలీసులు ఆయన వద్దకు వెళ్ళాడు. ఈ సమయంలో మీరెందుకు నా దగ్గరకు వచ్చారు అని మనోజ్ పోలీసులను అడగగా, మీరు పెద్ద సెలబ్రిటీ అయ్యుండొచ్చు, కానీ ఇంత దట్టమైన అడవి ప్రాంతానికి సమీపంగా ఉండడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉండాలని అనుకుంటే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు. నా ప్రైవసీ కి భంగం కలిగించడానికి మీకు ఎలాంటి అధికారం లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు మనోజ్. ఈ వాగ్వాదం పెరిగి పెద్దది అవుతుండడం తో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని భాకరాపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగే గొడవలు జరిగాయి. తనని, తన అనుచరులను ఎదో ఒక విధంగా ఇలా వేధిస్తూనే ఉన్నారని మనోజ్ మండిపడ్డాడు. ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదని ఆవేదన వ్యక్తం చేసాడు.
అనంతరం అనేక నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు మళ్ళీ మనోజ్ ని రిసార్ట్స్ లోకి వదిలిపెట్టారట. ఈ వార్త తెలియడం తో మనోజ్ అభిమానులు, ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో మోహన్ బాబు కుట్ర ఉందంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు కానీ, నిజంగానే రూల్స్ ప్రకారం రాత్రి సమయంలో దట్టమైన అడవి ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఉండరాదు. ఎందుకంటే క్రూర జంతువులూ ఆ సమయంలోనే సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఇకపోతే మనోజ్ చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.ఈ రెండు సినిమాల్లోనూ ఆయన నెగటివ్ రోల్ లోనే కనిపించబోతుండడం గమనార్హం. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్న మనోజ్, సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.