Sushmita Konidela Childhood Pics: నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు నేడు ఒక పెద్ద పండుగ లాంటి దినం అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏడాది ఉన్నట్టుగానే ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలు, రక్తదానాలు వంటివి చేస్తూనే ఉన్నారు అభిమానులు. మరో పక్క ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ఈ నెల 25 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఆ సినిమా అప్డేట్స్ లో కూడా మునిగి తేలుతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని సాయంత్రం విడుదల చేయబోతున్నారు. ఆ చిత్ర దర్శకుడు సుజిత్ ఈ సందర్భంగా నేడు ఉదయం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షురాలు తెలియజేస్తూ విడుదల చేసిన ఓజీ బ్రాండ్ న్యూ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. పవన్ నుండి ప్రేక్షకులు ఎలాంటివి అయితే ఆశిస్తారో, అలాంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయని పోస్టర్ ని చూస్తేనే అర్థం అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలను వెల్లువలాగా కురిపిస్తున్నారు. కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల(Konidela sushmitha) ఒక ట్వీట్ వేస్తూ, ఇప్పటి వరకు అభిమానులెవ్వరూ చూడని తన వ్యక్తిగత ఫోటో ని షేర్ చేసింది. ఆమె చిన్నతనం లో పవన్ కళ్యాణ్ వద్ద ఆశీస్సులు తీసుకుంటుండడాన్ని మనం ఈ ఫోటో లో గమనించొచ్చు. ఆమె మాట్లాడుతూ ‘బాబాయ్..నేను అనితర సాధ్యమైన పనులు చేయడానికి, ఎవ్వరూ ఆలోచించని విధంగా అలోచించి నా క్రియేటివిటీ ని బయటకు తీయడానికి కేవలం నువ్వు ఆదర్శం. నీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సుష్మిత. ఆమె మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో అభిమానులు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈరోజు అందరికంటే అత్యధిక మార్కులు కొట్టేసింది సుష్మిత నే అని, అద్భుతమైన ఫోటోని అభిమానులతో పంచుకొని సర్ప్రైజ్ కి గురి చేసిందని అంటున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అదే విధంగా పొద్దున్నే అందరికంటే ముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేసారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప దాదాపుగా టాలీవుడ్ మొత్తం పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.