https://oktelugu.com/

Hero Sushanth: వెబ్ సిరిస్‌లో సుశాంత్ బిజీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Hero Sushanth: అనుమోలు సుశాంత్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జున మేనళ్లుడు. కాళిదాసు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. తర్వాత కరెంట్, అడ్డా వంటి మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన చి.లా.సౌ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన అల […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 18, 2022 / 01:47 PM IST
    Follow us on

    Hero Sushanth: అనుమోలు సుశాంత్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జున మేనళ్లుడు. కాళిదాసు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. తర్వాత కరెంట్, అడ్డా వంటి మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన చి.లా.సౌ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి.

    Hero Sushanth

    తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన అల వైకుంఠపురంలో మూవీలో యాక్ట్ చేశాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం యాక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే నవీన్ చంద్ర యాక్ట్ చేసిన పరంపర వెబ్ సిరిస్ కు మంచి ఆదరణ లభించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక యంగ్ హీరో సుశాంత్ సైతం వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నాడు.

    Also Read: Bigg Boss OTT Telugu: అలక రాజాను దాటేసిన‌ కూల్ రాణి.. ఎంత ప‌నైపాయె..!

    ఇందుకు సంబంధించిన ఒక వెబ్ సిరిస్ కు సైతం ఆయన సైన్ చేశాడు. జీ5 ప్రసారం కాబోతున్న ఆ వెబ్ సిరిస్‌లో సుశాంత్ మెయిన్ రోల్ పోషిస్తున్నాడట. ఇక ఈ రోజు సుశాంత్ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘వరుడు కావలెను’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న లక్ష్మీ సౌజన్య.. ఈ వెబ్ సిరిస్‌కు డైరెక్షన్ చేస్తోంది.

    Hero Sushanth

    చి.ల.సౌ మూవీతో లైమ్‌టైంలోకి వచ్చిన సుశాంత్.. కేవలం హీరో పాత్రలే కాకుండా కీ రోల్ పాత్రల్లో యాక్ట్ చేసేందుకు ఓకే చెబుతున్నాడు. అల వైకుంఠపురములోనూ ఇలాగే కీ రోల్ లో యాక్ట్ చేశాడు. ఈ మూవీ హిట్ అయింది. రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్న రావణాసుర మూవీలో సుశాంత్ ఓ కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. మ‌రి ఆయ‌న వెబ్ సిరీస్‌లో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటారో అనేది వేచి చూడాలి.

    Also Read: Radhe Shyam Collection: రాధేశ్యామ్ విష‌యంలో జ‌ర‌గ‌ని పుష్ప త‌ర‌హా మ్యాజిక్‌.. డిజాస్ట‌ర్ టాక్ క‌న్ఫ‌ర్మ్‌..!

    Tags