https://oktelugu.com/

Bigg Boss OTT Telugu: అలక రాజాను దాటేసిన‌ కూల్ రాణి.. ఎంత ప‌నైపాయె..!

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదిక‌గా నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేస్తుంది. గ‌తంలో కంటే చాలా విభిన్నమైన టాస్కుల‌తో అల‌రిస్తోంది. నిత్యం గొడ‌వ‌లు, తిట్టుకోవ‌డాలు బాగానే న‌డుస్తున్నాయి. అయితే బిగ్ బాస్‌లో ఎప్ప‌టి నుంచో ఓ సంప్ర‌దాయం న‌డుస్తోంది. హౌస్ లో ఒక‌ర్ని టార్గెట్ చేయ‌డం చాలాకామ‌న్‌. కాగా ఇలా టార్గెట్ చేసిన ప్ర‌తిసారి ఆ టార్గెట్ అయిన వ్య‌క్తి క‌ప్పు గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతోంది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 18, 2022 / 01:35 PM IST
    Follow us on

    Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీ వేదిక‌గా నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేస్తుంది. గ‌తంలో కంటే చాలా విభిన్నమైన టాస్కుల‌తో అల‌రిస్తోంది. నిత్యం గొడ‌వ‌లు, తిట్టుకోవ‌డాలు బాగానే న‌డుస్తున్నాయి. అయితే బిగ్ బాస్‌లో ఎప్ప‌టి నుంచో ఓ సంప్ర‌దాయం న‌డుస్తోంది. హౌస్ లో ఒక‌ర్ని టార్గెట్ చేయ‌డం చాలాకామ‌న్‌. కాగా ఇలా టార్గెట్ చేసిన ప్ర‌తిసారి ఆ టార్గెట్ అయిన వ్య‌క్తి క‌ప్పు గెలుస్తున్నాడు.

    bindu madhavi akhil

    ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతోంది. హౌస్‌లో అందరూ బిందు మాధ‌విని టార్గెట్ చేయ‌డం స్టార్ట్ చేశారు. వాస్త‌వానికి బింధు మాధ‌వి చాలా కూల్‌గా ఉంటుంది. ఎవ‌రి జోలికి పోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. బింధు మాధ‌వి మొద‌టి సారి బిగ్ బాస్ నామినేష‌న్స్ లోకి వ‌చ్చింది. ఆమెతో పాటు తేజస్వి, అజయ్, స్రవంతిలు కూడా మొద‌టిసారి నామినేట్ అయ్యారు.

    Also Read: Radhe Shyam Collection: రాధేశ్యామ్ విష‌యంలో జ‌ర‌గ‌ని పుష్ప త‌ర‌హా మ్యాజిక్‌.. డిజాస్ట‌ర్ టాక్ క‌న్ఫ‌ర్మ్‌..!

    అయితే ఇక్క‌డే మ‌న కూల్ రాణి బింధు మాద‌వికి, అలాగే అల‌క రాజా అయిన అఖిల్‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. ఎక్క‌డ‌నుకున్నారు.. ఓటింగ్ లో అండి. అఖిల్ గ‌త వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు అత‌న్ని త‌న కూల్ యాటిట్యూడ్ తో వెన‌క‌కి నెట్టేసి ఓటింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది బింధు మాధ‌వి.

    మూడో వారంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంతా ఒకేసారి 12మంది నామినేట్ అయ్యారు. ఈ సారి ఓటింగ్ చాలా కీల‌కం కానుంది. ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది. కాబ‌ట్టి.. కానీ 11మందిని వెన‌క్కు నెట్టి, గ‌త వారం టాప్ లో ఉన్న అఖిల్ ను కూడా దాటేసి బింధు మాద‌వి టాప్ ప్లేస్ లో ఉందంటే మామూలు విష‌యం కాదు.

    అయితే హౌస్ లో ఈ అల‌క రాజా అఖిల్‌కు, కూల్ రాణి బింధుకు మ‌ధ్య కూడా కొన్ని క్లాషెన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి అంద‌రికంటే చాలా బాగా ఆడుతున్న మాధ‌వి ఎక్కువ ఓట్లు సాధిస్తోంది. వాస్త‌వానికి అఖిల్ టైటిల్ ఫేవ‌రెట్ గా బ‌రిలో నిలిచాడు. అత‌ను బిగ్ బాస్‌-4 సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. కాబ‌ట్టి అత‌నికి కామ‌న్‌గానే ఫ్యాన్ బేస్ ఎక్కువ‌గా ఉంటుంది. అత‌నికి ఉన్న అనుభవం కూడా అత‌నికి ప్ల‌స్ పాయింట్‌.

    bindu madhavi

    ఇవ‌న్నీ ఉన్న అఖిల్‌కు.. అస‌లు ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన మాధ‌వి ట‌ఫ్ ఫైట్ ఇస్తోందంటే ఆమె ఎంత‌లా ఆక‌ట్టుకుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆమె ఆట తీరును నాగార్జున కూడా మెచ్చుకున్నాడు. అయితే ఆమెను తేజస్వి, నటరాజ్ మాస్టర్ కూడా టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఆమెపై సింప‌తీ కూడా ఎక్కువ‌యిపోయింది. ఆమె పాజిటివ్ యాటిట్యూడ్ ఆమెకు అఖిల్ ను మించి ఓట్ల వ‌ర్షం కురిపిస్తోంది. అఖిల్‌కు 27శాతం ఓటింగ్ ఉంటే.. బింధుమాధవికి 28 శాతం ఉంది. ఇక ఈ వారం డేంజ‌ర్ జోన్ లో ఉన్న నటరాజ్ మాస్టర్, అజయ్ , స్రవంతిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

    Also Read: Bheemla Nayak OTT Release: భీమ్లానాయక్ ఓటీటీలో వచ్చే డేట్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..

    Tags