https://oktelugu.com/

బిగ్ బాస్-4పై షాకింగ్ కామెంట్స్ చేసిన సూర్యకిరణ్

  బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమై వారం గడిచిపోయింది. 16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 ప్రారంభమైన సంగతి తెల్సిందే. కంటెస్టులను పరిచయం చేసిన అనంతరం బిగ్ బాస్ తన ఆటను మొదలుపెట్టాడు. వారంరోజులపాటు బిగ్ బాస్ లో కంటెస్టులతో ఆటలాడించి నామినేషన్ ప్రక్రియను షూరు చేశాడు. కింగ్ నాగార్జున ఎలిమినేషన్లో ఉన్న కొంతమంది పేర్లు వెల్లడించారు. వీరిలో కొందరు సేఫ్ జోన్లో ఉండగా కొందరు నామినేషన్లో ఉన్నారని తెలిపారు. తొలివారం తప్పకుండా ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. […]

Written By: , Updated On : September 15, 2020 / 01:16 PM IST
Follow us on

 

biggg boss suryakiran

బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమై వారం గడిచిపోయింది. 16మంది కంటెస్టులతో బిగ్ బాస్-4 ప్రారంభమైన సంగతి తెల్సిందే. కంటెస్టులను పరిచయం చేసిన అనంతరం బిగ్ బాస్ తన ఆటను మొదలుపెట్టాడు. వారంరోజులపాటు బిగ్ బాస్ లో కంటెస్టులతో ఆటలాడించి నామినేషన్ ప్రక్రియను షూరు చేశాడు. కింగ్ నాగార్జున ఎలిమినేషన్లో ఉన్న కొంతమంది పేర్లు వెల్లడించారు. వీరిలో కొందరు సేఫ్ జోన్లో ఉండగా కొందరు నామినేషన్లో ఉన్నారని తెలిపారు. తొలివారం తప్పకుండా ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. అన్నట్లుగా తొలి వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా సాగింది.

Also Read: ఆర్ఆర్ఆర్ గురించి మరో ఆసక్తికర అప్ డేట్

బిగ్ బాస్-4 నుంచి తొలి ఎలిమినేటర్ గా డైరెక్టర్ సూర్యకిరణ్ అయ్యారు. షో నుంచి బయటికొచ్చిన సూర్యకిరణ్ బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో.. కంటెస్టుల ప్రవర్తన.. బిగ్ బాస్-4 షో నిర్వహణపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌజ్ అమ్మ రాజశేఖర్ మినహా పెద్దగా సినిమా నటులు లేరని సూర్యకిరణ్ చెప్పడం గమనార్హం.

‘సత్యం’ సినిమా హిట్టయ్యాక తాను హైదరాబాద్లోనే ఉన్నానని.. అయితే కొన్ని కారణాలతో చైన్నె వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో కొందరు తాను చనిపోయానని ప్రచారం చేయడం బాధకలిగించిందన్నారు. తనపై దుష్పప్రచారం చేస్తున్న వారికి సమాధానం చెప్పేందుకు ఉగాదికి సినిమా చేయాలని భావించినట్లు తెలిపారు. అయితే కరోనా కారణంగా సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని తెలిపారు. ఈ షో ద్వారా తన ఉనికిని మరోసారి చాటాలనే ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు.

బిగ్ బాస్ హౌజ్ టీచర్ లేని స్కూల్ లా సందడి ఉంటుందని తెలిపారు. అయితే తాను బిగ్ బిస్ ఇచ్చే ప్రైజ్ మని కోసం రాలేదని తెలిపారు. తాను మూడు నుంచి నాలుగువారాలు ఉంటానని భావించానని తెలిపాడు. బిగ్ బాసులోని కంటెస్టుల చర్యలు చాలా కృత్రిమంగా ఉంటాయని తెలిపారు. వారి నవ్వు కూడా సహజంగా లేదన్నారు. అతిచేసే వారినే బిగ్ బాస్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడని గ్రహించి వారంతా అలానే ప్రవర్తిస్తుంటారని తెలిపాడు.

Also Read: ‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే !

ఈ షోలో అమ్మరాజశేఖర్ మినహా పెద్దగా సినిమావాళ్లు లేరని కామెంట్ చేశాడు. హౌస్ లో తన కంటే చాలా తెలివైన వాళ్లు ఉన్నారని.. అంత తెలివితేటలు తనకు లేవన్నారు. మంచి చెబితే వినేవాళ్లు బిగ్ బాస్ హౌజ్లో లేరంటూ బాంబు పేల్చారు. మొత్తంగా బిగ్ బాస్ షోపై తనకు ఉన్న ఒపినియన్ ను కుండబద్దలు కొట్టేలా చెప్పేశారు.