https://oktelugu.com/

హైదరాబాద్ కు మహర్ధశ

ఇప్పటికే విమానాశ్రయం.. రైల్వే లైన్స్‌.. ఎంఎంటీఎస్‌.. మెట్రో కలిగి ఉన్న హైదరాబాద్‌ మహానగరం శిఖలో మరో కలికితురాయి చేరబోతోంది. ఇప్పటికే జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. Also Read: అక్టోబర్‌‌ 16 నాడే ఎంగిలిపూల బతుకమ్మ” త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు శ్రీకారం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 1:58 pm
    Follow us on

    ఇప్పటికే విమానాశ్రయం.. రైల్వే లైన్స్‌.. ఎంఎంటీఎస్‌.. మెట్రో కలిగి ఉన్న హైదరాబాద్‌ మహానగరం శిఖలో మరో కలికితురాయి చేరబోతోంది. ఇప్పటికే జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read: అక్టోబర్‌‌ 16 నాడే ఎంగిలిపూల బతుకమ్మ”

    త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో ముంబయి–హైదరాబాద్‌ మార్గం కూడా ఒకటి. ‘ఏడు కొత్త నడవాలకు సంబంధించిన డీపీఆర్‌‌లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు’ అని ఓ అధికారి చెప్పారు.

    దేశంలో ఫస్ట్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబయి–అహ్మదాబాద్‌ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 508.17 కిలోమీటర్లు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు కాగా.. 2023 డిసెంబర్‌‌ నాటికే బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాల్సి ఉంది. కానీ.. భూ సేకరణ, కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో ప్రాజెక్టు కాస్త 2028 అక్టోబర్‌‌కు వాయిదే వేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 63 శాతం భూ సేకరణ పూర్తయినట్లు సమాచారం.

    Also Read: కో‘దండమే’.. పోటీకి భయపడుతున్న కేసీఆర్?

    కొత్తగా కేంద్రం చేపట్టనున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి–హైదరాబాద్‌ 711 కిలోమీటర్లు, చెన్నై–మైసూరు 435 కిలోమీటర్లు, ఢిల్లీ–వారణాసి 865, ముంబయి–నాగ్‌పూర్‌‌ 753, ఢిల్లీ–అహ్మదాబాద్‌ 886, ఢిల్లీ–అమృత్‌సర్‌‌ 459, వారణాసి–హావ్‌డా 760 కిలోమీటర్లలో నిర్మించనున్నారు.