https://oktelugu.com/

భార్య అంటే కళ్యాణినే అట.. డైరెక్టర్ కన్నీళ్ళు !

డైరెక్టర్ గా ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితమే కనుమరుగైపోయిన సూర్య కిరణ్..మళ్ళీఎట్టకేలకు బిగ్‌బాస్ షోలో మొదటి వారమే ఎలిమినేట్ అయి.. మొత్తానికి సోషల్ మీడియాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. మళ్ళీ లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఒకప్పుడు సత్యం దర్శకుడు అంటూ.. హీరోయిన్ కళ్యాణి భర్త అంటూ సూర్య కిరణ్‌ ను సంబోధించేవారు. అలాగే అతన్ని గుర్తించే వారు కూడా. ఆ తరువాత ప్లాప్ ల్లోకి వెళ్ళడంతో అవకాశాలు దూరమయ్యాయి. అప్పటినుండి అసలు సూర్య కిరణ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 18, 2020 / 04:11 PM IST
    Follow us on


    డైరెక్టర్ గా ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితమే కనుమరుగైపోయిన సూర్య కిరణ్..మళ్ళీఎట్టకేలకు బిగ్‌బాస్ షోలో మొదటి వారమే ఎలిమినేట్ అయి.. మొత్తానికి సోషల్ మీడియాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. మళ్ళీ లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఒకప్పుడు సత్యం దర్శకుడు అంటూ.. హీరోయిన్ కళ్యాణి భర్త అంటూ సూర్య కిరణ్‌ ను సంబోధించేవారు. అలాగే అతన్ని గుర్తించే వారు కూడా. ఆ తరువాత ప్లాప్ ల్లోకి వెళ్ళడంతో అవకాశాలు దూరమయ్యాయి. అప్పటినుండి అసలు సూర్య కిరణ్ అంటే ఎవ్వరూ ? అని కావాలని అడుగుతున్నారట కొంతమంది. అలాంటి వారి ప్రశ్నలకు సమాధనం చెప్పేందుకే తాను బిగ్‌బాస్ షోలో పాల్గొన్నానని అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్యకిరణ్‌ చెబుతూ.. తన మాజీ భార్య కళ్యాణి గురించి కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు.

    Also Read: అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’గా అనుష్క రాబోతోంది !

    కళ్యాణి హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడే సూర్యకిరణ్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత సినిమాలకు గ్యాప్ కూడా తీసుకుంది. అయితే పెళ్ళయ్యాక కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే ఉన్నా.. 2016లో వీరి మధ్య మనస్పర్థలు రావడం.. అలా పరస్పర అంగీకారంతో మ్యూచువల్ డైరవ్స్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయినా తన మాజీ భార్య పై తనకున్న ప్రేమను మాత్రం చంపుకోలేదు సూర్య కిరణ్. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బిగ్ బాస్‌ కి వెళ్లడం ద్వారా కళ్యాణిని మిస్ అవ్వడం కాదు.. ఆమెను నేను రోజూ మిస్ అవుతూనే ఉన్నానని నిర్మోహమాటంగా తన మనసులోని బాధను బయటపెట్టేశాడు.

    Also Read: హైపర్ ఆదిని చితకబాదిన దొరబాబు భార్య..!

    పైగా ‘నాకు కళ్యాణిగారు అంటే, నా అమ్మ తరువాత అమ్మ అని, కళ్యాణిగారు అంటే నాకు ఎప్పుడూ గౌరవమే అని చెప్పుకొచ్చాడు. నా జీవితంలో కళ్యాణి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే ఇప్పటికీ కళ్యాణినే నా మనసులో ఉంది. కళ్యాణి కంటే నాకు ఇంకెవ్వరు అందంగా కనిపించరు. ఆమెకు నా అవసరం లేదని అనిపించిందేమో.. నాకైతే ఆమె ఇప్పటికీ కావాలనే ఉంది అంటూ మొత్తానికి తన హృదయంలోని బాధను క్లారిటీగా చెప్పేశాడు. పైగా ఈ జన్మకి తన భార్య అంటే కళ్యాణి మాత్రమే అని కూడా సూర్య కిరణ్ బయటకు కనబడని కన్నీళ్ళతో స్పష్టం చేసేశాడు. మరి ఈ మాటలకు కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతుందో.