2024లో గెలుపే లక్ష్యంగా జగన్ పెద్ద ప్లాన్?

ఏపీ చరిత్రలో భగీరథుడిగా మిగిలిపోవాలని సీఎం జగన్ కలలుగంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా పూర్తి చేయలేని పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 2024లో మరోసారి  గెలిచేందుకు జగన్ పెద్ద ప్లాన్లు చేస్తున్నారట.. ఈ మేరకు ఏపీకి సాగునీటి కొరత తీరిస్తే తనకు ఓట్ల వాన కురుస్తుందని యోచిస్తున్నారని సమాచారం. Also Read: వామ్మో… లోకేశ్ కోసం బాబు ఇంత చేశాడా..? సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక రాష్ట్రం ప్రభుత్వం స్సెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)లు ఏర్పాటు […]

Written By: NARESH, Updated On : September 18, 2020 4:59 pm

Jagan going to lanch another new welfare scheme

Follow us on

ఏపీ చరిత్రలో భగీరథుడిగా మిగిలిపోవాలని సీఎం జగన్ కలలుగంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా పూర్తి చేయలేని పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 2024లో మరోసారి  గెలిచేందుకు జగన్ పెద్ద ప్లాన్లు చేస్తున్నారట.. ఈ మేరకు ఏపీకి సాగునీటి కొరత తీరిస్తే తనకు ఓట్ల వాన కురుస్తుందని యోచిస్తున్నారని సమాచారం.

Also Read: వామ్మో… లోకేశ్ కోసం బాబు ఇంత చేశాడా..?

సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక రాష్ట్రం ప్రభుత్వం స్సెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)లు ఏర్పాటు చేయడం చాలా అరుదు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేసిన తొలి సీఎం జగన్మోహన్ రెడ్డిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వీటి నిర్మాణం కోసం ఐదేళ్లలో కనీసం రూ.96,550కోట్లు వ్యయం చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటికోసం రూ. 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.72,458 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది.

Also Read: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు జగన్ సర్కార్ షాక్..?

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎస్పీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39,980కోట్లు ఐదేళ్ళలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి ఐదేళ్ళలో రూ.8,787కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీవీ-3 కింద ఏపీ రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12,702 కోట్లు.. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా-పెన్నాల అనుసంధానం కోసం రూ.7,636 కోట్లు.. ఎస్పీవీ-5 క్రింద కృష్ణా – కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3,356 కోట్లను ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు.ఏపి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లను పరుగులు పెట్టించి వృధాగా పోతున్న నీటిని ఓడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.తద్వారా ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి ప్రజల మెప్పు పొంది మరోసారి గెలిచేందుకు ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.