https://oktelugu.com/

డిజిటల్ మీడియా గొంతు నొక్కేందుకు కేంద్రం ప్లాన్?

ఆధునిక సాంకేతికతలో పాతవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పత్రికలు, మీడియా చానెల్స్ కు వచ్చిందన్న అభిప్రాయం జర్నలిస్టు సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. 2020నే పత్రికలకు ముగింపు పలుకుతుందా అన్న అనుమానాలు కులుగుతున్నాయి. ఒక శతాబ్ధానికి పైగా పత్రికలు ఈ వ్యవస్థలో కొనసాగాయి. రాజకీయాలను శాసించాయి..  కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు అంపశయ్యపై నిలబడ్డాయి. Also Read: ప్లే స్టోర్ నుంచి పేటీఎం మాయం.. డబ్బు సేఫేనా? స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవ్వరూ దినపత్రికలను […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 04:10 PM IST

    ditigal media

    Follow us on

    ఆధునిక సాంకేతికతలో పాతవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పత్రికలు, మీడియా చానెల్స్ కు వచ్చిందన్న అభిప్రాయం జర్నలిస్టు సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. 2020నే పత్రికలకు ముగింపు పలుకుతుందా అన్న అనుమానాలు కులుగుతున్నాయి. ఒక శతాబ్ధానికి పైగా పత్రికలు ఈ వ్యవస్థలో కొనసాగాయి. రాజకీయాలను శాసించాయి..  కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు అంపశయ్యపై నిలబడ్డాయి.

    Also Read: ప్లే స్టోర్ నుంచి పేటీఎం మాయం.. డబ్బు సేఫేనా?

    స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవ్వరూ దినపత్రికలను చూసే పరిస్థితి కనిపించడం లేదు. న్యూస్ యాప్ ల ద్వారా అంతా వితిన్ స్పాట్ లో జరిగిన సంఘటనను మరుక్షణమే తెలుసుకుంటున్నారు. తెల్లవారి వచ్చే పత్రికల కోసం ఎదురుచూడడం లేదు. ఇప్పుడు అంతా డిజిటల్ మీడియానే. ప్రజలంతా రిపోర్టర్లే. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో దాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా డిజిటల్ మీడియా దేశంలో పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో.. వైరల్ కోసం కొందరు చేసే అతి వల్ల అన్నీ అబద్దాలున్నాయి.

    అయితే మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీం కోర్టులో తాజాగా జరిగిన విచారణలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీడియా నియంత్రణకు సంబంధించి  తొలుత నియంత్రించాల్సి వస్తే డిజిటల్ మీడియాపైనే చర్యలు చేపట్టాలని తెలిపింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, డిజిటల్ మీడియా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం క్షణాల్లో వైరల్ గా మారిపోతుండడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని కాబట్టి విచ్చలవిడిగా వైరల్ చేసే డిజిటల్ మీడియానే నియంత్రించాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

    Also Read: పార్లమెంట్ ను మించి.. బాబు గారి ఖర్చే ఖర్చబ్బా?

    నిజానికి డిజిటల్ మీడియా ప్రజల గొంతుకై నిలుస్తోంది. ఎవరికి వారు గ్రామాల నుంచి జరుగుతున్న వాస్తవాలను ఫొటోలు, వీడియోలు తీసి మరీ కళ్లకు కడుతున్నారు.  డిజిటల్ మీడియాకు కూడా నియంత్రణ సంకెళ్లు వేస్తే ఇక గొంతెత్తే గళాలకు అడ్డుకట్ట వేసినట్టేనన్న చర్చ సాగుతోంది.. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తున్నది చూడాలి.  డిజిటల్ మీడియాను నియంత్రిస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పలువురు కౌంటర్లు ఇస్తున్నారు.