https://oktelugu.com/

Surya Kanguv : సూర్య కంగువ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే…

ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాని భారీ లెవెల్లో చాటుకోబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సినిమా టీజర్ ప్రేక్షకులందరిని అలరించింది. అందులో భాగంగానే ఈ సినిమా కోసం తమిళ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2024 / 09:03 PM IST

    Kanguva - Sizzle Teaser

    Follow us on

    Surya Kanguv : తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలో సూర్య ఒకరు ఈయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ అనే సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

    ఇక డైరెక్టర్ శివ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలే కావడం విశేషం. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో మరోసారి డిఫరెంట్ గా కూడా సినిమాలు చేయగలరని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో సూర్యని చాలా కొత్తగా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే శివ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ సినిమాను విక్రమ్ హీరోగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు. కానీ విక్రమ్ ఈ కథని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా స్టోరీని సూర్యకి చెప్పి ఆయన చేత ఈ సినిమాని చేయిస్తున్నారు.

    అయితే విక్రమ్ కి ఈ కథ చెప్పిన తర్వాత తెలుగు లో స్టార్ హీరో అయిన మహేష్ బాబుకి కూడా ఈ కథ చెప్పినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక వీళ్లిద్దరు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాకి సూర్య అయితేనే కరెక్ట్ అని సూర్యతో ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో అటు సూర్య, ఇటు డైరెక్టర్ శివ ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాని భారీ లెవెల్లో చాటుకోబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే సినిమా టీజర్ ప్రేక్షకులందరిని అలరించింది. అందులో భాగంగానే ఈ సినిమా కోసం తమిళ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు…