Homeఎంటర్టైన్మెంట్Unstoppable 4: 'అన్ స్టాపబుల్ 4' షోలో బాలయ్య ప్రశ్నలకు ఏడ్చేసిన హీరో సూర్య..వైరల్ అవుతున్న...

Unstoppable 4: ‘అన్ స్టాపబుల్ 4’ షోలో బాలయ్య ప్రశ్నలకు ఏడ్చేసిన హీరో సూర్య..వైరల్ అవుతున్న వీడియో!

Unstoppable 4: ‘ఆహా’ ఓటీటీ యాప్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి, టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిలిచేలా చేసిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో, ఇప్పుడు నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాగా, రెండవ ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు. ఈ రెండు ఎపిసోడ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడవ ఎపిసోడ్ కి తమిళ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ‘కంగువ’ ప్రొమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఈ ఎపిసోడ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు. నవంబర్ 8 వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదే ఎపిసోడ్ లో ‘కంగువ’ లో విలన్ గా నటించిన బాబీ డియోల్, అలాగే డైరెక్టర్ శివ కూడా పాల్గొన్నారు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కాసేపటి క్రితమే ఆహా మీడియా టీం విడుదల చేయగా, అది సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యింది. ఈ ప్రోమో విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా బాలయ్య సూర్యతో మాట్లాడుతూ ‘నేషనల్ అవార్డు ని అందుకున్నావు. ఎవరెస్ట్ నుండి చూస్తుంటే జీవితం ఎలా ఉంది’ అని అడుగుతాడు. దానికి సూర్య సమాధానం చెప్తూ ‘ఒక్క మాటలో చెప్పమంటారా సార్..ఆకాశమే నా హద్దురా’ అని అంటాడు. ఆ తర్వాత సూర్య తమ్ముడు కార్తీ గురించి మాట్లాడుతూ ‘మీ తమ్ముడు ఫోన్ లో నీ పేరు ఏమని సేవ్ చేసుకొని ఉంటాడు’ అని అడుగుతాడు బాలయ్య. అన్న అని సేవ్ చేసుకున్నట్టు పలక మీద రాస్తాడు సూర్య. అదే విధంగా మీరిద్దరూ గొడవపడిన లాస్ట్ టాపిక్ ఏమిటి అని అడుగుతాడు బాలయ్య. దానికి సూర్య నిజం చెప్పమంటారా?, లేదా అబద్దం చెప్పమంటారా? అని అడుగుతాడు.

ఆ తర్వాత కార్తీ కి బాలయ్య ఫోన్ చేసి మాట్లాడుతూ ‘మీ అన్నయ్య అన్ని అబద్దాలే చెప్తున్నాడు’ అని అంటాడు. దానికి కార్తీ ఆయన చిన్నప్పటి నుండి అంతే సార్ అని ఫన్నీ గా చెప్తాడు. అప్పుడు సూర్య ‘నువ్వు కత్తి రా..కార్తీ కాదు’ అని ఫన్నీ రిప్లై ఇస్తాడు. ఇలా ఫన్నీ గా సాగిపోతుండగా మధ్యలో కొన్ని ఎమోషనల్ సందర్భాలు వస్తాయి. వివరాల్లోకి వెళ్తే చెన్నై లో సూర్య స్థాపించిన అగార ఫౌండేషన్ చేసే సేవలకు సంబంధించి ఒక చిన్న AV వీడియో వేస్తారు. నేను స్థాపించిన అగార ఫౌండేషన్ కి ఎన్నో విరాళాలు వస్తుంటాయి. అందులో సగానికి పైగా తెలుగు ప్రజలు అందిచినవే ఉంటాయి అని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు సూర్య. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.

 

Unstoppable With NBK S4 E3 Promo | Suriya, Bobby deol | Singham Meets Samarasimham | Nov 08

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version