https://oktelugu.com/

Hindi Chatrapathi Collections: ఆశ్చర్యపరుస్తున్న హిందీ ‘ఛత్రపతి’ మొదటి రోజు వసూళ్లు.. బెల్లంకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడా..!

ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి మొదటి ఆట నుండే హిందీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రివ్యూస్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. దీనిని బట్టీ అక్కడి ఆడియన్స్ కమర్షియల్ సినిమాల కోసం ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : May 12, 2023 / 05:44 PM IST

    Hindi Chatrapathi Collections

    Follow us on

    Hindi Chatrapathi Collections: ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఛత్రపతి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది, అప్పటి వరకు నలుగురు హీరోలలో ఒకడిగా చలామణి అయ్యే ప్రభాస్, ఈ చిత్రం తర్వాత స్టార్ హీరో గా మారాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతమైన ఎలివేషన్ సన్నివేశాలు మరియు యాక్షన్ బ్లాక్స్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తే, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా సెంటిమెంటల్ సీన్స్ తో నింపేసాడు రాజమౌళి.

    అలాంటి చిత్రాన్ని రీమేక్ చెయ్యడం అనేది సాహసం తో కూడుకున్న పని, కానీ మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ చిత్రాన్ని హిందీ లో బెల్లంకొండా సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేసాడు. సుమారుగా రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నేడే విడుదల అయ్యింది, మరి బాలీవుడ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము.

    ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి మొదటి ఆట నుండే హిందీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. రివ్యూస్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. దీనిని బట్టీ అక్కడి ఆడియన్స్ కమర్షియల్ సినిమాల కోసం ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

    అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండే సింగల్ స్క్రీన్స్ లో మంచి ఆక్యుపెన్సీ ఉందని,ముఖ్యంగా మాస్ సర్క్యూట్స్ లో ఓపెనింగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక పక్క ‘ది కేరళ స్టోరీ’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న సమయం లో ఛత్రపతి కి ఈ మాత్రం ఓపెనింగ్ వచ్చిందంటే గ్రేట్ అనే చెప్పాలి.