https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి తీసిన ఆ సినిమాలో సూర్యను సెకండ్ హీరోగా అడిగారా..? ఆయన చేయకపోవడానికి కారణం ఏంటి..?

ఇక అప్పట్లో సూర్య రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కోల్పోయారంటూ ఇప్పుడు సోషల్ మీడియా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు సూర్య రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చిన చేస్తాను అని ఓపెన్ గా చెబుతున్నాడు

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 08:13 AM IST

    Suriya was proposed as the second hero in Rajamouli's film

    Follow us on

    Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకులలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో ముందు వరుసలో ఉంటాయి. అందుకే రాజమౌళి తో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

    అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా తెరకెక్కించి మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి నితిన్ తో చేసిన సై సినిమా ఒక మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో నితిన్ తో పాటుగా శశాంక్ సెకండ్ హీరో క్యారెక్టర్ ని పోషించాడు. అయితే ఆ టైంలో తమిళంలో సూర్య అప్పుడప్పుడే హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఆ పాత్ర కోసం రాజమౌళి సూర్య ని అడిగారట. కానీ ఆ పాత్ర సూర్యకి అంతగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశాడట…

    ఇక అప్పట్లో సూర్య రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కోల్పోయారంటూ ఇప్పుడు సోషల్ మీడియా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు సూర్య రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చిన చేస్తాను అని ఓపెన్ గా చెబుతున్నాడు. అప్పుడు ఆ క్యారెక్టర్ ను మిస్ చేసుకున్నందుకు కూడా తను తన సన్నిహితులు దగ్గర చాలా వరకు బాధపడ్డట్టుగా కూడా తమిళ్ మీడియాలో కొన్ని కథనలైతే వెలువడ్డాయి. నిజంగా రాజమౌళి గొప్పతనం గురించి తెలియనప్పుడు చాలామంది అతని సినిమాల్ని రిజెక్ట్ చేశారు. ‘బాహుబలి ‘ సినిమాలో కూడా చాలామంది నటులను తీసుకోవాలని అనుకున్నప్పటికీ అందరూ ఆ క్యారెక్టర్లను రిజెక్ట్ చేశారు.

    కానీ అప్పుడు వాళ్లకు తెలియదు ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది…అందువల్లే వాళ్ళు దాన్ని ఊహించలేక ఆ క్యారెక్టర్లను రిజెక్ట్ చేశారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా ఆసక్తి చూపిస్తుండడం విశేషం…ఇక మొత్తానికైతే ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో తను బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన మేకోవర్ ను కూడా ఫినిష్ చేశాడు.

    ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు ఒక సూపర్ లుక్ లో మనకు దర్శనమిచ్చాడు…ఇక ‘ బాహుబలి ‘, ‘త్రిబుల్ ఆర్’ సినిమాలతో ఒక మ్యాజిక్ ను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో మరొక సారీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని ఆయన క్రేజ్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒక తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ సినిమా స్థాయికి తీసుకెళ్లి అక్కడ తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసేలా చేయబోతున్నాడు అనేది మాత్రం వాస్తవం…