https://oktelugu.com/

‘స్టార్ హీరో’ చిరకాల కల నెరవేరబోతోంది !

హీరో సూర్యకి తమిళంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. తెలుగులో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు అని ఈ తమిళ హీరో బలంగా నమ్ముతుంటాడు. ఇందులో నిజం లేకపోయినా.. హీరోగారు కాబట్టి.. ఆయనను కలిసిన మనుషులందరూ ఇదే విషయాన్ని పదే పదే చెప్పడంతో.. మొత్తానికి ఈ అబద్ధం సూర్య దృష్టిలో నిజం అయిపోయింది. అందుకే తన తెలుగు అభిమానుల కోసం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు రచయిత కోన వెంకట్ తో […]

Written By:
  • admin
  • , Updated On : April 6, 2021 / 02:58 PM IST
    Follow us on


    హీరో సూర్యకి తమిళంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. తెలుగులో కూడా అంతమంది అభిమానులు ఉన్నారు అని ఈ తమిళ హీరో బలంగా నమ్ముతుంటాడు. ఇందులో నిజం లేకపోయినా.. హీరోగారు కాబట్టి.. ఆయనను కలిసిన మనుషులందరూ ఇదే విషయాన్ని పదే పదే చెప్పడంతో.. మొత్తానికి ఈ అబద్ధం సూర్య దృష్టిలో నిజం అయిపోయింది. అందుకే తన తెలుగు అభిమానుల కోసం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు రచయిత కోన వెంకట్ తో కథా చర్చలు కూడా జరుపుతున్నాడని తెలుస్తోంది.

    కోన, సూర్యకి ఒక కథ చెప్పాడని కథ బాగున్నా.. కథనంలో మ్యాటర్ లేదు అని, అందుకే మరో కథను పట్టుకురమ్మన్ని సూర్య కోరాడని తెలుస్తోంది. ప్రస్తుతం కోన, తన రైటర్స్ బృందం బివిఎస్ రవి, గోపి మోహన్ ల సహకారంతో మరో కథను వండే పనిలో పడ్డాడట. ఈ కథ పూర్తి అయిన వెంటనే.. సూర్యను కలిసి కొత్త కథను వినిపిస్తాడట. మరి సూర్యకి కథ నచ్చితే.. సినిమాని వెంటనే స్టార్ట్ చేయాలని కోన ప్లాన్ లో ఉన్నాడు. ఎందుకంటే.. ఈ సినిమాకి నిర్మాతగానూ కోనగారే ఉండాలని ఈ రచయితగారి ఆశ.

    ఇక సూర్య విషయానికి వస్తే.. సూర్యకి సూపర్ స్టార్ ఇమేజ్ రాకముందు నుండే, తెలుగులో కూడా సూర్యకు ఎక్కువ గుర్తింపు ఉంది. అందుకే ఏ తమిళ హీరో చేయని రిస్క్ ను సూర్య చేసాడు. తన కెరీర్ మొదటినుండి సూర్య చేసిన ప్రతి తమిళ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తన సినిమా విడుదల చేస్తూ ఓ దశలో తెలుగు స్టార్ హీరోలకే పోటీ ఇచ్చే ఊపులో కనిపించాడు. అందుకే ఎప్పటికైనా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తానని చాల సంవత్సరాల నుండి చెబుతున్నాడు.