https://oktelugu.com/

Sai Pallavi: నితిన్ ‘ఎల్లమ్మ’ నుండి సాయి పల్లవి అవుట్..కారణం ఏమిటంటే!

సాయి పల్లవి(Sai Pallavi) ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ సినిమాలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. ఆమె ఒక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది అంటే, సగం సూపర్ హిట్ అయిపోయినట్టే అని ట్రేడ్ భావిస్తుంది. ఒక సినిమాకి షూటింగ్ ప్రారంభానికి ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ రప్పించగల సత్తా ఉన్న హీరోయిన్. అలాంటి సాయి పల్లవి ఒక సినిమా నుండి తప్పుకుంది అన్నా కూడా, అదే స్థాయి నెగటివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం 'ఎల్లమ్మ'(Yellamma Movie) పరిస్థితి అలాగే ఉంది.

Written By: , Updated On : March 20, 2025 / 08:45 PM IST
Follow us on

Sai Pallavi: సాయి పల్లవి(Sai Pallavi) ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ సినిమాలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. ఆమె ఒక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది అంటే, సగం సూపర్ హిట్ అయిపోయినట్టే అని ట్రేడ్ భావిస్తుంది. ఒక సినిమాకి షూటింగ్ ప్రారంభానికి ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ రప్పించగల సత్తా ఉన్న హీరోయిన్. అలాంటి సాయి పల్లవి ఒక సినిమా నుండి తప్పుకుంది అన్నా కూడా, అదే స్థాయి నెగటివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం ‘ఎల్లమ్మ'(Yellamma Movie) పరిస్థితి అలాగే ఉంది. బలగం లాంటి సెన్సేషనల్ హిట్ ని తీసి సత్తా చాటిన ‘జబర్దస్త్’ వేణు(Venu Yaldandi), దిల్ రాజు(Dil Raju) నిర్మాణం లో చేయబోతున్న రెండవ సినిమా ఇది. ముందుగా ఈ సినిమా కథని హీరో నాని(Natural Star Nani) కి వినిపించారు. కానీ ఎందుకో ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరో నితిన్(Hero Nithin) కి స్టోరీ వినిపించగానే ఆయన వెంటనే ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

హీరోయిన్ గా సాయి పల్లవి ఖరారైంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో చాలా గట్టిగా వినిపించింది. రీసెంట్ గానే వేణు సాయి పల్లవి ని కలిసి స్టోరీ ని కూడా వినిపించాడు. ఆమెకు కథ చాలా బాగా నచ్చింది. నితిన్, సాయి పల్లవి కాంబినేషన్ స్క్రీన్ మీద సూపర్ గా వర్కౌట్ అవుతుంది, నితిన్ హిట్ కొట్టేసినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ సాయి పల్లవి ఈ సినిమా నుండి తప్పుకుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. స్టోరీ ఆమెకు అద్భుతంగా నచ్చింది, నితిన్ తో నటించడం కూడా ఇష్టమే, కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. పైగా సాయి పల్లవికి ఈమధ్య వరుసగా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రెమ్యూనరేషన్ బాగా పెంచేసింది. దిల్ రాజు అనుకున్న బడ్జెట్ కి అది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఆమెని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించినట్టు మరో రూమర్ కూడా సోషల్ మీడియా లో తిరుగుతుంది.

మరి ఇప్పుడు ఎల్లమ్మ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలి. అలాంటి హీరోయిన్ అంటే సాయి పల్లవి కాకుండా సమంత, రష్మిక వంటి వారిని పెట్టుకోవాలి. వాళ్ళను పెట్టుకోవాలంటే సాయి పల్లవి కి లాగానే భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలి. మరి ఈ సినిమా బడ్జెట్ కి వాళ్ళు డిమాండ్ చేసే రెమ్యూనరేషన్ కి సరిపోతుందా లేదా అనే చర్చల్లో ఉన్నారట మేకర్స్. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నాడు. హీరోయిన్ ఒకటి ఫిక్స్ అయితే షూటింగ్ ని మొదలు పెట్టేస్తారట.