https://oktelugu.com/

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ… ఆందోళనలో అభిమానులు

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులుగా మోకాలి సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ సర్జరీ కోసమే మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణకు ఫిబ్రవరి వరకూ విరామం ప్రకటించారు. దాంతో ఆయన లేని సన్నివేశాలు దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మహేష్ మోకాలి సర్జరీ పూర్తి అయినట్లు తెలుస్తుంది. దీని కోసం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 06:13 PM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులుగా మోకాలి సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ సర్జరీ కోసమే మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణకు ఫిబ్రవరి వరకూ విరామం ప్రకటించారు. దాంతో ఆయన లేని సన్నివేశాలు దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మహేష్ మోకాలి సర్జరీ పూర్తి అయినట్లు తెలుస్తుంది. దీని కోసం ఆయన స్పెయిన్ వెళ్లారు. అక్కడ సర్జరీ పూర్తయిన తర్వాత దుబాయ్ వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి మోకాలినొప్పితో బాధపడుతున్న మహేష్ బాబుకు ఇప్పుడు ఆపరేషన్ జరగడం పట్ల ఆయన అభిమానులంతా మహేష్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

    ఇక పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమాకు బ్రేక్ పడింది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా తర్వత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. కాగా మహేష్ కోలుకున్న అనంతరం ఈ సినిమా షూటింగ్ జరగనుంది. మహేష్ వెంట ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఉన్నారు. ఇక, ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికి వస్తే… ఈ మూవీ ‘పోకిరి’ తరహాలో ఉంటుంది అని ఎన్టీఆర్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మహేష్ బాబు చెప్పారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న సినిమా విడుద‌ల కానుంది.