https://oktelugu.com/

కరోనా నివారణకు అండగా సురేష్ ప్రొడక్షన్స్

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా నివారణ కోసం పలువురు సెలబ్రెటీలు, సినిమా స్టార్లు ప్రభుత్వానికి విరాళాలను ప్రకటిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిని నిర్మాణంలో పెద్ద సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్ సంస్థ కరోనా నివారణ కోసం కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల సినిమి షూటింగ్ నిలిచిపోయాయి. అలాగే లాక్డౌన్ కారణంగా సినిమా […]

Written By: , Updated On : March 28, 2020 / 04:02 PM IST
Follow us on

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ఇండియాలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా నివారణ కోసం పలువురు సెలబ్రెటీలు, సినిమా స్టార్లు ప్రభుత్వానికి విరాళాలను ప్రకటిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిని నిర్మాణంలో పెద్ద సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్ సంస్థ కరోనా నివారణ కోసం కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించింది.

కరోనా వైరస్ వల్ల సినిమి షూటింగ్ నిలిచిపోయాయి. అలాగే లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లన్ని మూసివేయడంతో సినిమావాళ్లకు కష్టాలు మొదలైయ్యాయి. దీంతో రోజువారీ కూలీ చేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు సురేష్ ప్రొడక్షన్ ముందుకొచ్చింది. అదేవిధంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లను ఆదుకునేందుకు ఈ సంస్థ సిద్ధమైంది.

సీని కార్మికులతోపాటు హెల్త్ వర్కర్స్ కు తమ వంతు సాయంగా కోటి రూపాయలను అందజేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీ విరాళాలను ప్రకటించారు. మరికొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు.