https://oktelugu.com/

టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

టీడీపీ అధినేత చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులని పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా ఉంది. అధికార వైసీపీ కంటే బలమైన నాయకుల అండ ఉంది. అందుకే ఏడాదిగా వైసీపీ ప్రభుత్వాన్ని.. జగన్ ఆట ఆడించేశాడు.కానీ ఇప్పుడు సీఎం జగన్ ఆట మొదలుపెట్టేసరికి కాస్త డిఫెన్స్ లో పడ్డారు. జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం ఇటీవల చోటుచేసుకున్న రెండు పరిణామాలతో టీడీపీ చేస్తున్న ప్రచారం.. వైసీపీ బీసీ నేతల్లో ఆలోచనలకు కారణమైందట.. అచ్చెన్నాయుడి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2020 / 02:00 PM IST
    Follow us on


    టీడీపీ అధినేత చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులని పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా ఉంది. అధికార వైసీపీ కంటే బలమైన నాయకుల అండ ఉంది. అందుకే ఏడాదిగా వైసీపీ ప్రభుత్వాన్ని.. జగన్ ఆట ఆడించేశాడు.కానీ ఇప్పుడు సీఎం జగన్ ఆట మొదలుపెట్టేసరికి కాస్త డిఫెన్స్ లో పడ్డారు.

    జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

    ఇటీవల చోటుచేసుకున్న రెండు పరిణామాలతో టీడీపీ చేస్తున్న ప్రచారం.. వైసీపీ బీసీ నేతల్లో ఆలోచనలకు కారణమైందట.. అచ్చెన్నాయుడి అరెస్ట్ తర్వాత దాన్ని బీసీలపై దాడిగా అభివర్ణించిన టీడీపీ, దాని అనుకూల మీడియా వాదనకు జనాలు పెద్దగా స్పందించలేదు. వైసీపీ బాగానే తిప్పికొట్టింది. కానీ తాజాగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకుమార్ ఉదంతాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. బీసీ వర్గానికి జగన్ ప్రభుత్వం వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. రెడ్డిల ఆధిపత్యంలోని జగన్ ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందని పెద్ద ఎత్తున తన అనుకూల మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.

    నిజానికి ఇద్దరూ టీడీపీ బీసీ మాజీ మంత్రులు తప్పు చేసే అరెస్ట్ అయ్యారు. వారు తప్పు చేయకపోతే అరెస్ట్ చేసే సాహసం పోలీసులకు ఉండదన్నది వాస్తవం. కానీ ఈ విషయాన్ని టీడీపీ బాగా వాడుకుంటోంది. బీసీలపై ప్రేమను కురిపిస్తూ.. వైసీపీ నేతల్లోనూ సానుభూతి కలిగేలా టీడీపీ కొత్త ప్లాన్లు చేస్తోందని తెలిసింది.

    ‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

    తాజాగా వైసీపీలోనూ ఈ బీసీ గళాలు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ లాజిక్ ను గ్రహించలేక కొందరు వైసీపీలోని బీసీ నేతలు, ఎమ్మెల్యేలు తాజాగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిసింది.

    తాజాగా ఖాళీ అవుతున్న రెండు బీసీ మంత్రుల పదవులను బీసీలకే కేటాయించాలని వైసీపీలో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డిని కలిసి కొత్తమంది వైసీపీ ఎమ్మెల్యేలు కోరారట.. ఈ మేరకు ఫిర్యాదులు చేశారట.. పదవిని ఆశిస్తోన్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఈ కొత్త డిమాండ్ ను పార్టీలో రేపి కొత్త కుంపటి తెరతీశారని ప్రచారం జరుగుతోంది.

    ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకున్న సీఎం జగన్ తాజాగా పార్టీలో గళమెత్తుతున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్నారని.. వారి విషయంలో ఉదాసీనత పనికిరాదని అదుపు చేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది. టీడీపీ ట్రాపులో పడ్డ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.