https://oktelugu.com/

Surekhavani : నా మొగుడు బ్రతికున్నా ఇలానే తిరిగేదాన్ని… సురేఖావాణి షాకింగ్ కామెంట్స్!

ఆర్జీవీతో దిగిన ఫోటోల మీద డిబేట్లు పెట్టి ఇష్టమొచ్చినట్టుగా రాశారు. నా పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు .. పిచ్చి నా కొడుకులు అని వదిలేశా. మొదట్లో సుప్రీత ఈ కామెంట్లు తట్టుకోలేకపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 1:53 pm

    Surekhavani's shocking comments on her dead husband!

    Follow us on

    Surekhavani : ఇండస్ట్రీలో సురేఖ వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు ఉంది. తన అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కూతురుతో కలిసి సందడి చేస్తూ ఉంటుంది. మోడ్రన్ లుక్స్ తో తల్లీకూతుళ్ల రచ్చ మామూలుగా ఉండదు. సమయం దొరికినప్పుడల్లా టిప్స్, వెకేషన్స్ అంటూ దుబాయ్, గోవా చెక్కేస్తూ ఉంటారు. వారి వెకేషన్ ఫోటోలు ట్రోలింగ్ కి గురవుతుంటాయి.

    సురేఖ వాణి నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా సురేఖ వాణి ట్రోలింగ్ పై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. నా పేరు చెప్పుకొని డబ్బు సంపాదించుకుంటున్నార్లే అని లైట్ తీసుకున్నానని చెప్పింది. ప్రశాంతమైన జీవితం ఇవ్వమని దేవుడిని కోరుకుని గుండు చేయించుకున్నట్లు ఆమె తెలిపింది. అందరి కంటే ముందు తన కూతురు సుప్రీత నీ లుక్ బాగుందని చెప్పి కాన్ఫిడెన్స్ నింపింది అని సురేఖ చెప్పింది.

    మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని, అందుకే అలా తిరుగుతుంది అని కొందరు అంటుంటారు. ట్రోల్ చేస్తుంటారు. కానీ నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. .. అప్పుడు ఎక్స్పోజర్ లేదు .. ఇప్పుడు ఎక్స్పోజర్ వచ్చింది. నా మొగుడున్నా ఇలాగే తిరిగేవాళ్ళం. మొదట్లో ఈ ట్రోలింగ్, కామెంట్స్ చూసి బాధ పడ్డాను. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాడెవడో అంటే మనం రియాక్ట్ అవ్వడం వేస్ట్ అనుకున్నాను.

    ఆర్జీవీతో దిగిన ఫోటోల మీద డిబేట్లు పెట్టి ఇష్టమొచ్చినట్టుగా రాశారు. నా పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు .. పిచ్చి నా కొడుకులు అని వదిలేశా. మొదట్లో సుప్రీత ఈ కామెంట్లు తట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు కామెంట్లు చూసి ఇద్దరం నవ్వుకుంటున్నాం అంటూ సురేఖ వాణి చెప్పుకోచ్చారు. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తోంది సురేఖ వాణి.