https://oktelugu.com/

Sandeep Reddy Vanga: అనిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పిన సందీప్ రెడ్డి వంగ…

బాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే అక్కడి హీరోలు చేసే సినిమాలను వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను మాత్రమే వాళ్ళు ఆదరిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇన్ని రోజుల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన సినిమాలన్నీ ఒక మూస ధోరణి లో వెళుతున్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడమే దానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు...

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 05:04 PM IST

    What character Sandeep Reddy Vanga likes the most in his movies

    Follow us on

    Sandeep Reddy Vanga: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే అధికారం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ఉందని విర్రవీగిన వాళ్లందరి ఇప్పుడు తోకలు ముడుచుకుంటున్నారు. ఒక్క సక్సెస్ ని సాధించడానికి అక్కడ స్టార్ హీరోలు నానా తంటాలు పడుతున్నారు. అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం తెలుగు సినిమాల జపం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అక్కడి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ దక్కుతుంది. మన సినిమాల కోసం వాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ఆ సినిమాను సూపర్ సక్సెస్ ఫుల్ గా నిలపడంలో బాలీవుడ్ ప్రేక్షకులు ముందు వరుసలో ఉన్నారు. మరి బాలీవుడ్ హీరోల సినిమాలకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలనే వాళ్లు ఎక్కువగా చూస్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు సైతం పెను ప్రభంజనాన్ని సృష్టించలేకపోతున్నారు.

    ఇక రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. దీనికి కారణం ఏంటి అంటే ఆ సినిమా దర్శకుడు అయిన సందీప్ వంగ తెలుగు సినిమా దర్శకుడు కావడం విశేషం…మరి మొత్తానికైతే బాలీవుడ్ దర్శకులు ఇప్పుడు ఎవరు కూడా తమ సినిమాలతో మ్యాజిక్ ను చేయలేకపోతున్నారు.

    ఇక ఇదిలా ఉంటే అనిమల్ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందని దర్శకుడు సినిమా ఎండింగ్ లో అనౌన్స్ చేశాడు. మరి ‘అనిమల్ పార్క్’ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడు తెర మీదకి వస్తుంది.అనేది కూడా ఇప్పుడు ప్రేక్షకులందరిలో ఒక తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనిమల్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అనిమల్ పార్క్ కూడా అంతకంటే మంచి విజయాన్ని సాధిస్తుందంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పాడు.

    దాంతో అతని అభిమానులు అలాగే రణ్బీర్ కపూర్ అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత అంటే 2026 వ సంవత్సరంలో అనిమల్ పార్క్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువచ్చే విధంగా ఆయన ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది…