https://oktelugu.com/

Surekha Vani Daughter Supritha: మా అమ్మ‌కి రెండో పెండ్లి చేస్తా.. మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టిన సురేఖ‌వాణి కూతురు

Surekha Vani Daughter Supritha:  సినీ రంగంలో చాలామంది న‌టేమ‌ణులు త‌మ భ‌ర్త‌ల‌తో విడిపోయి ఒంట‌రిగానే జీవిస్తున్నారు. అయితే ఇందులో చాలామంది త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి జీవిస్తున్నారు. భ‌ర్త‌తో విడాకులు తీస‌కుని పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను చూసుకుంటున్నారు. అయితే మొన్న సింగ‌ర్ సునీత పెండ్లి అయిన త‌ర్వాత ఇలాంటి వారి గురించి వార్త‌లు రావ‌డం స్టార్ట్ అయ్యాయి. వారు కూడా రెండో పెండ్లి చేసుకోబోతున్నారంటూ రూమ‌ర్లు వ‌చ్చాయి.   అయితే భ‌ర్త చ‌నిపోవ‌డంతో కూతురు సుప్రిత‌తో క‌లిసి జీవిస్తోంది […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 26, 2022 / 03:26 PM IST
    Follow us on

    Surekha Vani Daughter Supritha:  సినీ రంగంలో చాలామంది న‌టేమ‌ణులు త‌మ భ‌ర్త‌ల‌తో విడిపోయి ఒంట‌రిగానే జీవిస్తున్నారు. అయితే ఇందులో చాలామంది త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి జీవిస్తున్నారు. భ‌ర్త‌తో విడాకులు తీస‌కుని పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను చూసుకుంటున్నారు. అయితే మొన్న సింగ‌ర్ సునీత పెండ్లి అయిన త‌ర్వాత ఇలాంటి వారి గురించి వార్త‌లు రావ‌డం స్టార్ట్ అయ్యాయి. వారు కూడా రెండో పెండ్లి చేసుకోబోతున్నారంటూ రూమ‌ర్లు వ‌చ్చాయి.

    Surekha Vani Daughter Supritha

     

    అయితే భ‌ర్త చ‌నిపోవ‌డంతో కూతురు సుప్రిత‌తో క‌లిసి జీవిస్తోంది న‌టి సురేఖ వాణి. ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అంద‌రికీ చాలా సుప‌రిచితురాలు. ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు చేసిన సురేఖ‌.. వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం బాధ‌లు ప‌డుతోంది. అయితే ఇప్ప‌టికీ గ్లామ‌ర్‌ను మెయింటేన్ చేస్తోంది. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఘాటు ఫొటోల‌ను షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈమె రెండో పెండ్లి చేసుకుంటుంద‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో వస్తున్నాయి.

    Also Read:  ‘పునీత్ రాజ్‌ కుమార్’ చివరి చిత్రం పై భారీ అంచనాలు

    ఈ నేప‌థ్యంలో ఆమె కూతురు సుప్రిత తాజాగా త‌ల్లి పెండ్లి విష‌యం మీద స్పందించింది. త‌న త‌ల్లికి క‌చ్చితంగా రెండో పెండ్లి చేయాల‌నే ఆలోచ‌న త‌న‌కు ఉంద‌ని, అందుకోస‌మే ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని వివ‌రించింది. కాగా ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని చెప్పుకొచ్చింది. కానీ ఈ పెండ్లి విష‌యంలో త‌న‌ది తుది నిర్ణ‌యం కాద‌ని, త‌న త‌ల్లికే ఆ నిర్ణ‌యాన్ని వ‌దిలిపెట్టిన‌ట్టు చెప్పుకొచ్చింది.

    Surekha Vani Pics

    త‌న‌కు మాత్రం త‌న త‌ల్లికి రెండో పెండ్లి చేయాల‌నే తాప‌త్ర‌యం ఉంద‌ని, త‌న త‌ల్లిని సంతోషంగా చూడాల‌న్న‌దే త‌న కోరిక అని వివ‌రించింది. త‌న త‌ల్లికి పెండ్లి చేస్తేనే బాగుంటుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న‌ట్టు త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టేసింది. కాగా త‌న తండ్రి చ‌నిపోయాక త‌ల్లి మీద ఎన్నో పుకార్లు పుట్టించార‌ని చెప్పుకుని బాధ ప‌డింది.

    అలాంటి బాధ నుంచి బ‌య‌ట ప‌డుతుంద‌ని త‌న త‌ల్లిని పార్టీల‌కు తీసుకెళ్తే.. చాలా దారుణంగా కామెంట్లు చేశార‌ని వాటి వ‌ల్ల తాము ఎంతో బాధ‌ప‌డ్డామంటూ చెప్పుకువ‌చ్చింది. అందుకే అలాంటి కామెంట్ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశామ‌ని, ఇప్పుడు త‌న త‌ల్లి కెరీర్ మీదనే పూర్తి దృష్టి పెట్టింద‌ని చెప్పుకొచ్చింది సుప్రిత‌. త్వ‌ర‌లోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలి మ‌రి.

    Also Read: నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డ్.. సంతోషంలో థమన్ డ్యాన్స్ !

    Tags