Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమ్ లేడీ కమెడియన్ సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియా పోస్ట్స్ తోనే సురేఖా వాణి వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియా ఫ్రీక్ గా మారిన సురేఖా వాణి హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తన టీనేజ్ డాటర్ సుప్రీతతో కలిసి ఇలాంటి కవ్వించే పనులు చేయడంతో మరింతగా నెటిజన్స్ దృష్టి ఆకర్షిస్తున్నారు. సురేఖా వాణి భర్త 2019లో అనారోగ్యంతో మరణించారు. దీర్ఘకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కన్నుమూశారు.

భర్త సురేష్ తేజ మరణంతో సురేఖా వాణి కొన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆమె రీఎంట్రీ ఇద్దామనుకునే లోపు లాక్ డౌన్ వచ్చింది. లాక్ డౌన్ ముగిసినా సురేఖా వాణికి మునుపటిలా ఆఫర్స్ రావడం లేదు. ఈ కారణాలతో సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం అరుదైపోయింది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా పోస్ట్స్ కి సురేఖా వాణి తెరలేపారు. షార్ట్ ఫ్రాక్స్, ట్రెండీ వేర్స్ ధరించి వీడియోలు, ఫోటో షూట్స్ చేశారు. అవి విశేషంగా వైరల్ అయ్యాయి.
ఇక కూతురు సుప్రీతతో సురేఖా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. విందులు, విహారాలు, పార్టీలు… ఏవైనా కలిసే పాల్గొంటారు. ఆ మధ్య సుప్రీత బర్త్ డే పార్టీలో కూతురికి స్వయంగా సురేఖా షాంపేన్ తాగించారు. ఈ ఫోటో వైరల్ అయ్యింది. సింగర్ సునీత రెండో వివాహం చేసుకోగా… సురేఖా వాణి రెండో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఆమె కూడా ఒక బిగ్ షాట్ తో పెళ్ళికి సిద్దమయ్యారనే కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సుప్రీత ఖండించారు. నిరాధార కథనాలు ప్రచారం చేయవద్దని మండి పడ్డారు.

పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు కానీ… అందగాడైన ధనవంతుడు దొరికితే రిలేషన్షిప్ కొనసాగిస్తానని సురేఖా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోవడానికి కారణం ఆఫర్స్ ఇవ్వడం లేదంటున్నారు. ఇండస్ట్రీ మమ్మల్ని మరిచిపోయింది. వేషాలు ఇస్తే ఎందుకు చేయమని సురేఖా వాణి కుండబద్దలు కొట్టారు. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం ఆపడం లేదు. తాజాగా డెనిమ్ షార్ట్ ధరించి సెగలు రేపింది. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. సురేఖా వాణి హాట్ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మరోవైపు కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనే ప్రయత్నాల్లో సురేఖా వాణి ఉన్నారు.