Small Savings Schemes: మధ్యతరగతి ప్రజలకు మోడీ ఇస్తున్న మరో కానుక

Small Savings Schemes: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు మరో కానుక అందించనుంది. ప్రావిడెంట్ ఫండ్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలు ఆకర్షణీయమైన రీతుల్లో వడ్డీ రేట్లు పెంచాలని చూస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రచించింది. జనవరి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న వడ్డీరేట్లతో ప్రయోజనాలు పెరగనున్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి తీపి […]

Written By: Srinivas, Updated On : December 12, 2022 10:28 am
Follow us on

Small Savings Schemes: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు మరో కానుక అందించనుంది. ప్రావిడెంట్ ఫండ్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలు ఆకర్షణీయమైన రీతుల్లో వడ్డీ రేట్లు పెంచాలని చూస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రచించింది. జనవరి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న వడ్డీరేట్లతో ప్రయోజనాలు పెరగనున్నాయని చెబుతున్నారు.

Small Savings Schemes

కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి తీపి కబురు అందించబోతోంది. మధ్య తరగతి ప్రజల కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది. కొత్త ఏడాది కానుకగా ఈ మేరకు తీపికబురు అందించబోతోంది. మధ్య తరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిఫ్ట్ ఇవ్వబోతోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్టు పెంచాలని భావిస్తోంది. దీంతో మధ్య తరగతి వారికి ప్రయోజనాలు కలిగేందుకు దోహదం చేయాలని చూస్తోంది. దీని కోసం కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.

రిజర్వ్ బ్యాంకు ఈ ఏడాది రెపో రేటు 225 బేసిక్ పాయింట్ల మేర పెంచింది. దీంతో మధ్యతరగతి ప్రజలకు వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. సేవింగ్ చేసే ప్రతి పైసాపై వడ్డీ రేటు ఎక్కువగా రానుంది. దీంతో పొదుపు చేసే వారికి మంచి ఫలితాలు దక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి స్మాల్ సేవింగ్ స్కీములపై వడ్డీ రేట్లు సమీక్షిస్తుంది. బ్యాంకుల్లో వేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడంతో మనకు లాభాలు చేకూరుస్తాయి. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

2023లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే వడ్డీ రేట్లు పెంచినట్లు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే డిపాజిట్ చేసుకునే మధ్య తరగతి వారికి మంచి ఫలితాలు రావడం ఖాయం. కేంద్రం కొత్త ఏడాదిలో ప్రజలకు ఊరట కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చిన్న మొత్తాల పొదుపులో పెట్టుబడి పెంచుకోవాలని చూస్తోంది. రెగ్యులర్ గా పొదుపు పథకాలు కొనసాగాలంటే కొన్ని ప్రయోజనాలు అందిస్తే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం ఇలా వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతోంది.

Small Savings Schemes

సేవింగ్స్ డిపాజిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, నెలవారీ సంపాదన ప్రకారం ప్రజలు వారికి అనువయ్యే పథకాల్లో డబ్బు పొదుపు చేయాలని చూస్తారు. ఈ నేపథ్యంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచడంతో వారికి లాభం కలగనుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల్లో డిపాజిట్లు పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాలసీలు మరింత పెరగనున్నాయి. వడ్డీరేట్ల ప్లాన్లపై 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచి ప్రజలను ఆకర్షించాలని చూస్తోంది.

Tags