Nadamuri Balakrihsna: 2017 వ సంవత్సరం నందమూరి బాలకృష్ణ కి ఎంతో ప్రత్యేకం..ఎందుకంటే ఆయన వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై అప్పట్లో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం గా నిలిచింది..బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించిన మొట్టమొదటి వీరుడు శాతకర్ణి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు లభించాయి..మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రభంజనం ని తట్టుకొని ఈ సినిమా 50 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు..అయితే మన చరిత్ర గురించి చెప్తున్నా కథ కాబట్టి ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాలలో పన్ను రాయితీ ఇచ్చారు..దీనితో నిర్మాతలకు కూడా మంచి లాభాలు వచ్చాయి..అయితే పన్ను రాయితీ వెసులుబాటు కలిపించినప్పుడు టికెట్ రేట్లు కూడా తగ్గించాలి..జనాలకు అందుబాటులో ఉండేట్టు ఉండాలి..కానీ గౌతమీ పుత్ర శాతకర్ణి టిక్కెట్లు అలా అమ్మలేదు..అధిక దారల్కకే జనాలకు విక్రయించారు.

అయితే ఈ విషయాన్నీ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది..అధిక ధరలకు విక్రయిస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర టీం పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీమ్ కోర్టులో ఫిర్యాదు చేసారు..పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా టికెట్ రేట్స్ తగ్గించలేదని..దీనితో పన్ను మినహాయింపు వల్ల ఆ సినిమా ఆర్జించిన ఆ లాభాలను తిరిగి ప్రభుత్వాలకు ఇవ్వాలంటూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం ఆ ఫిర్యాదు లో ప్రధానంగా పేర్కొన్న అంశాలలో ఒకటి..ఇటీవలే సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి చంద్రచూడ్ ఈ కేసు ని విచారించిన తర్వాత బాలయ్య బాబు తో పాటు ఆ చిత్ర నిర్మాతైనా రాజీవ్ రెడ్డి కి ఉత్తర్వులు జారీ చేసింది..మరి దీనిపై బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు..బాలయ్య సినిమాల పరంగా ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నాడనే చెప్పాలి.
Also Read: Vikram Cobra First Review: విక్రమ్ ‘కోబ్రా’ మూవీ మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఎందుకంటే ఆయన హీరో గా నటించిన అఖండ సినిమా గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..అలాంటి సినిమా తర్వాత బాలయ్య బాబు ప్రస్తుతం క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది,.ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..ఇలా వరుసగా క్రేజీ కాంబినేషన్స్ తో అభిమానులకు ఎన్నడూ లేని హై ని ఇస్తున్నాడు బాలయ్య బాబు.