OG Remake: ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ సినిమా కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులు అయితే ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి, రిలీజ్ వరకు నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. ఫలితంగా పది రోజులు కూడా గడవకముందే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువలో ఉంది ఈ చిత్రం. ఆ తర్వాత కూడా లాంగ్ రన్ భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి స్టడీ ట్రెండ్ ని కొనసాగిస్తుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని హిందీ లో భారీ లెవెల్ లో విడుదల చేయనందుకు అభిమానులు మేకర్స్ పై మండిపడుతున్నారు.
అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైనప్పటికీ కూడా హిందీ వెర్షన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓటీటీ లో విడుదలయ్యాక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో వీక్షించాడట. ఆయన మరెవరో కాదు, హృతిక్ రోషన్. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చడం, ఎలాగో హిందీ వెర్షన్ నార్త్ ఇండియా లో భారీ రేంజ్ లో విడుదల అవ్వకపోవడం తో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట హృతిక్ రోషన్. ఈమేరకు ఆయన డైరెక్టర్ సుజిత్ ని సంప్రదించినట్టు సమాచారం. కుదిరితే ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సుజిత్ ఓజీ మూవీ సక్సెస్ ఊపులో ఉన్నాడు. ఒక పక్క సంబరాల్లో పాల్గొంటూనే, మరోపక్క హీరో నాని తో చేయబోయే సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను పూర్తి చేసాడు.
ఈ శనివారం ఆయన థమన్ తో కలిసి USA లోని సినీమార్క్ వెస్ట్ ప్లానో థియేటర్ లో అభిమానులతో సినిమా చూడబోతున్నాడు. కొన్ని రోజులు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేసి , కాస్త రిలాక్స్ అయ్యి హీరో నాని మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ కి తుడి మెరుగులు దిద్దబోతున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాకనే ఓజీ మూవీ హిందీ రీమేక్ కి ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆయన పవన్ కళ్యాణ్ తో ఓజీ సీక్వెల్ మరియు ప్రీక్వెల్ ప్లాన్ చేసే పనిలో కూడా ఉన్నాడు. ఇలాంటి సమయం లో ఆయన బాలీవుడ్ లో ఓజీ రీమేక్ కి దర్శకత్వం వహించడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.