Tirupati Laddu : హిందూ సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను బలంగా నమ్మే స్టార్ హీరోలలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ భావజాలం తో ఆయన ఒక రాజకీయ పార్టీ ని కూడా స్థాపించాలని అనుకున్నాడు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిది అని తన సన్నిహితులు చెప్పారని, అందుకే రాజకీయాల అరంగేట్రం చేయడం లేదంటూ చెప్పి తప్పించుకున్నాడు. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం పై అభిమానులు సైతం మండిపడ్డారు. ఇది పిరికివాడు చేసే చర్య అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా తిరుపతి లడ్డు తయారీకి జంతువుల కొవ్వు కలిగిన నెయ్యిని ఉపయోగించారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. NDB సంస్థ కూడా నిజంగానే జంతువుల కొవ్వు వాడినట్టు మా పరిశోధనలో తేలింది అని రిపోర్ట్ ఇవ్వడంతో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి.
దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు ఈ ఘటనపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వట్టియాన్’ ప్రొమోషన్స్ లో భాగంగా మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో రజినీకాంత్ కూడా పాల్గొన్నాడు, ఒక విలేఖరి రజినీకాంత్ తో మాట్లాడుతూ ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుపతి లడ్డు తయారీ లో కల్తీ జరిగింది అనే విషయం పెద్ద చర్చకు దారి తీసింది..దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని రజినీకాంత్ ని అడగగా, దానికి ఆయన సమాధానం ఇస్తూ ‘నో..కామెంట్స్’ అని అన్నాడు. హిందూ ధర్మానికి భంగం కలిగేలా ఒక సంఘటన జరిగితే రజినీకాంత్ లాంటి ఆధ్యాత్మిక విలువలు ఉన్న ఒక నటుడు ఇలా స్పందించకుండా ప్రశ్నని దాటవేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోట్ల మందిని ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న ఇలాంటి నటులు కూడా ధైర్యంగా మాట్లాడేందుకు ముందుకు రాకపోతే భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా తమిళ హీరో కార్తీ తన లేటెస్ట్ చిత్రం ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డు వ్యవహారం లో చేసిన ఫన్నీ కామెంట్స్ పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. యాంకర్ లడ్డు కి సంబంధించిన ఒక మీమ్ ని చూపించగా, దానికి కార్తీ సమాధానం ఇస్తూ ‘లడ్డు ఇప్పుడు సెన్సిటీవ్ టాపిక్..దాని గురించి మాట్లాడొద్దు’ అంటూ నవ్వుతు కౌంటర్ ఇస్తాడు. దీనికి పవన్ కళ్యాణ్ సీరియస్ రియాక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత కార్తీ క్షమాపణలు చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ స్పందించడం వంటివి జరిగాయి. ఇలాంటి సంఘటనలు ఎదురు అవుతాయనే భయం తోనే రజినీకాంత్ తిరుపతి లడ్డు వివాదం పై స్పందించే ధైర్యం చేయలేదా?, అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి.