https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : సోనియాకి బానిస లాగా మారిన నిఖిల్ కి నాగార్జున కోటింగ్..పరువు తీసేసిన ప్రేరణ.. వైరల్ అవుతున్న వీడియో!

నాగార్జున ఇది నిజమేనా అని కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. అందరూ అవును అని ఏకపక్షంగా సమాధానం చెప్తారు. తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 08:21 PM IST

    nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షో లో డైలీ ఎపిసోడ్స్ కంటే ఎక్కువగా వీకెండ్ ఎపిసోడ్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే వారం మొత్తం జరిగిన ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ చేసే తప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున ఇచ్చే కోటింగ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ ప్రోమోలో నాగార్జున ఎప్పటి లాగానే తన హోస్టింగ్ తో అదరగొట్టేసాడు అనిపించింది. కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరుపై ప్రేక్షకుల మనసుల్లోని మాటలను నాగార్జున నోటి నుండి రావడం తో ప్రేక్షకులు సంతృప్తి చెందారు. ముందుగా ప్రోమో మొదలు అవ్వగానే నాగార్జున కంటెస్టెంట్స్ తో ఆడబోయే గేమ్ గురించి వివరిస్తూ ‘ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో..జీరో..మీకు ఎవరు హీరో అనిపిస్తే వాళ్ళ నెత్తి మీద కిరీటం పెట్టండి, ఎవరు జీరో అనిపిస్తే వాళ్ళ ముఖం మీద రెడ్ ఇంక్ తో ఉన్నటువంటి ‘క్రాస్’ మార్క్ పెట్టండి’ అంటాడు.

    ముందుగా మణికంఠ ‘సీత’ కు కిరీటం పెడుతాడు. అప్పుడు నాగార్జున మాట్లాడుతూ ‘ఆమె నా దృష్టిలో కూడా హీరోనే’ అని అంటుంది. ఆ తర్వాత పృథ్వీ కి నబీల్ కిరీటం పెడుతాడు. అప్పుడు నాగార్జున పృథ్వీ గురించి మాట్లాడుతూ ‘మూడు గంటలు బేస్ మీద కదలకుండా, చిరు నవ్వు పోకుండా అలాగే నిల్చున్నావు. నాకు ఆ ఒక్క టాస్కుతో ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయావు’ అని పృథ్వీ రాజ్ తో అంటాడు. అందుకు పృథ్వీ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత హౌస్ లో జీరో అనిపిస్తున్న కంటెస్టెంట్స్ ముఖం మీద క్రాస్ మార్క్ గుద్దండి అని నాగార్జున అడగగా, హౌస్ లో అత్యధిక శాతం మంది మణికంఠ కు గుద్దుతారు. ముందుగా నబీల్ మణికంఠ ముఖం పై క్రాస్ మార్క్ వేస్తూ ‘సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటకి పంపాలని అనుకుంటాడు’ అని అంటాడు. ఆ తర్వాత పృథ్వీ రాజ్ మణికంఠ ముఖ్యం పై క్రాస్ మార్క్ వేస్తూ ‘చాలా అబద్దాలు చెప్తుంటాడు సార్’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘అబద్ధాలా..చాలా పెద్ద మాట అది’ అని అంటాడు. అప్పుడు నాగార్జున మణికంఠ తో మాట్లాడుతూ ‘ఎందుకు నువ్వు ప్రతీ దానికి అతిగా ఆలోచిస్తున్నావు’ అని అడగగా, దానికి మణికంఠ ‘నాకు అదే అర్థం కావడం లేదు సార్’ అని అంటాడు. ఇక ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ ని నామినేట్ చేస్తూ ‘అందరూ కలిసికట్టుగా ఆడాలని అతనే చెప్పాడు. కానీ చివరికి అతని క్లాన్ ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని పడగొట్టాడు’ అని అంటుంది. అప్పుడు నాగార్జున మాట్లాడుతూ ‘నీకే కాదు ప్రేరణ..నాకు కూడా అదే అనిపించింది, సీతకు అదే అనిపించింది’ అని అంటాడు. ఆ తర్వాత నాగార్జున నిఖిల్ తో మాట్లాడుతూ ‘టాస్కు పేరు ఏమిటో ఒకసారి చెప్పు’ అని అంటాడు. అప్పుడు నిఖిల్ ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ అని సమాధానం ఇస్తాడు.

    అప్పుడు నాగార్జున మాట్లాడుతూ ‘మరి నువ్వు తీసింది ఎవరిని?, నబీల్ ని తొలగించడం సరైన నిర్ణయమా ?’ అని అంటాడు. అప్పుడు నిఖిల్ ‘ఎక్కడో మిస్ బ్యాలన్స్ అయ్యింది సార్’ అని అంటాడు. ‘మిస్ బ్యాలన్స్ అవ్వడానికి కారణమైన మిస్ ఎవరు?’ అని నాగార్జున అడగగా, కెమెరాలు సోనియా వైపు చూపిస్తాయి. ‘నీ క్లాన్ లోకి రావడానికి ఒక్కరు కూడా ఇష్టపడలేదు..ఎందుకంటావ్?’ అని నాగార్జున అడగగా, నిఖిల్ దానికి సమాధానం చెప్తూ ‘అందరూ ఏమి జరిగినా మేము ముగ్గురం కలిసే చేశామని అనుకుంటున్నారు’ అని నిఖిల్ చెప్పగా, నాగార్జున ఇది నిజమేనా అని కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. అందరూ అవును అని ఏకపక్షంగా సమాధానం చెప్తారు. తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే.