https://oktelugu.com/

Rajinikanth’s ‘Jailor : వెబ్ సిరీస్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’.. ఫ్యాన్స్ కి ఇక పండగే!

సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటోళ్ళతో చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా మూవీ టీం విడుదల చేసింది. దీనికి ఫ్యాన్స్,ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 09:53 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth’s ‘Jailor : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ‘జైలర్’ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని తలపించే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని సృష్టించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్నీ భాషల్లో పాన్ ఇండియన్ చిత్రం గా విడుదలైన ఈ సినిమాకి దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లు ఇప్పుడున్న అనేక మంది స్టార్ హీరోలకు కూడా లేదు అనే సంగతి మన అందరికీ తెలుసు. కేవలం ప్రభాస్ మాత్రమే ‘కల్కి’ చిత్రంతో జైలర్ గ్రాస్ ని దాటగలిగాడు. ఇకపోతే ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశం ఉందని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

    ఇలా సోషల్ మీడియా లో జైలర్ చిత్రం గురించి ప్రచారమయ్యే వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు మూవీ టీం ‘జైలర్’ చిత్రం మీద డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ చేసి సన్ నెక్స్ట్ ఓటీటీ లో విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీ లో ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరు కనిపిస్తారు. సినిమాలో తమకి అనుభవమైన సంఘటనలు, రజినీకాంత్ తో కలిసి నటించిన అనుభూతి, ఇంకా ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ లో చెప్పారట. అలాగే సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోలు కూడా ఈ డాక్యుమెంటరీ లో పొందుపరిచారట. ఇటీవలే రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక డాక్యూమెంటరీ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానిని అనుసరించే ‘జైలర్’ టీం కూడా ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ చేసినట్టు తెలుస్తుంది.

    ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జై భీం’ ఫేమ్ జ్ఞానవేల్ రాజాతో కలిసి ‘వెట్టియాన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుపాటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ తో ‘కూలీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రారంభానికి ముందే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన మామూలు హీరోలతో సినిమాలు చేసిన అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటోళ్ళతో చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా మూవీ టీం విడుదల చేసింది. దీనికి ఫ్యాన్స్,ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.