IPL 2025 Qualifier 2 Yuzvendra Chahal: క్వాలిఫైయర్-1 లో జరిగిన పొరపాట్ల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్న పంజాబ్ జట్టు.. క్వాలిఫైయర్ -2 లో అసలైన మార్పులతో రంగంలోకి దిగుతోంది. జట్టుకు అత్యంత అవసరమైన ఆటగాళ్లు అనుకున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నది. క్వాలిఫైయర్ -1 లో ఆకట్టుకోలేని ప్లేయర్లను మొహమాటం లేకుండా దూరం పెడుతోంది. స్థూలంగా చూస్తే క్వాలిఫైయర్ -2 లో వీర స్వర్గాన్ని పక్కన పెట్టి విజయాన్ని మాత్రమే దక్కించుకోవాలని పంజాబ్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు అత్యంత దారుణమైన రికార్డును నేపథ్యంలో.. దానిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పంజాబ్ జట్టు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్ల కూర్పు విషయంలో పకడ్బందీ విధానాలు అమలు చేస్తోంది.
కన్నడ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో ఆడ లేకపోయిన యజువేంద్ర చాహల్ కు.. క్వాలిఫైయర్ -2 లో పంజాబ్ జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. కన్నడ జట్టుతో క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరిగినప్పుడు చాహల్ గాయపడ్డాడు. అతడు గాయపడడం పంజాబ్ జట్టు విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు క్వాలిఫైయర్ -2 లో అతడు ఆడుతున్నాడు. చాహల్ కు ముంబై జట్టుపై మంచి రికార్డు ఉంది. పైగా వైవిధ్యమైన బంతులు వేయడంలో చాహల్ కు తిరుగుండదు. పైగా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత అతడి సొంతం.
కన్నడ జట్టుతో జరిగిన మ్యాచ్లో విఫలమైన పంజాబ్ ఆటగాళ్లు.. ముంబై తో జరుగుతున్న క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో ఆకట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శశాంక్ సింగ్, అయ్యర్, స్టోయినీస్ తమ సామర్థ్యానికి మించి ఆడాల్సి ఉంది. ఈ నలుగురు కనుక భారీ పరుగులు చేస్తే పంజాబ్ జట్టుకు తిరుగు ఉండదు. ఇక బౌలర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అర్ష్ దీప్ సింగ్ తో పాటు ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయాలి. ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలి. ముందుగా భీకరమైన ఫామ్ లో ఉన్న రోహిత్, సూర్య కుమార్ యాదవ్, బెయిర్ స్టో ను కట్టడి చేస్తే పంజాబ్ జట్టుకు తిరుగు ఉండదు. పైగా అహ్మదాబాద్ మైదానం హార్దిక్ పాండ్యా సేనకు ఇంతవరకు కలిసి రాని ఫలితం ఇచ్చిన నేపథ్యంలో.. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని పంజాబ్ బౌలర్లు రాణించాల్సి ఉంది.. చాహల్ మాత్రమే కాకుండా, మిగతా బౌలర్లు సమష్టిగా రాణిస్తేనే.. ముంబై జట్టు భారీగా పరుగులు చేయకుండా నిలువరించడానికి అవకాశం ఉంటుంది.