Rajinikanth in NTR Neel movie: నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘డ్రాగన్’̣. ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అవ్వలేదు. కనీసం టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. ఎన్టీఆర్ లాంటి ఊర నాటు మాస్ హీరోతో ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ ఎలాంటి సినిమా తీస్తాడు, ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది అందరిలో నెలకొన్న ఉత్కంఠ. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కి పెద్ద బ్రేక్ పడింది. రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ మొదలైంది అంటూ వార్తలు వినిపించాయి కానీ, మూవీ టీం నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మూడవ షెడ్యూల్ ఎప్పుడు మొదలు అవ్వుద్దో తెలియదు కానీ, ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఈ చిత్రం కేవలం ఒక్క భాగం గా తెరకెక్కడం లేదు, రెండు భాగాలుగా తెరకెక్కుతుంది అట. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియో రోల్ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని సంప్రదించే పనిలో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ముందుగా ఈ పాత్ర కోసం కమల్ హాసన్ ని అనుకున్నారు కానీ, రజినీకాంత్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది అని ఎన్టీఆర్ సూచించడం తో ప్రశాంత్ నీల్ కూడా ఏకీభవించాడట. కేవలం రజినీకాంత్ తో చర్చలు జరపడం మాత్రమే బ్యాలన్స్ ఉంది. వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత ప్రశాంత్ నీల్ చెన్నై కి వెళ్లి రజినీకాంత్ కి ఈ స్టోరీ ని వినిపిస్తాడని టాక్.
ఒకవేళ రజినీకాంత్ కి తన పాత్ర, స్టోరీ నచ్చి ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకుంటే మాత్రం సౌత్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి, ఈ చిత్రానికి ఎలాగో నార్త్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. రజినీకాంత్ అనే పవర్ కూడా తోడైతే, ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమాని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2027 వరకు ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు.