Rajinikanth In Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం 2023 వ సంవత్సరం లో విడుదలై వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే కొల్లగొట్టడం కాదు, టాలీవుడ్ లో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిలిచిపోయింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి లెజండరీ నటీనటులందరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తారని బహుశా మనం గతం లో కలలో కూడా ఊహించి ఉండము. జెనరేషన్ కి ఒక సినిమా అరుదుగా ఇలాంటివి వస్తుంటాయి. అయితే ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లైమాక్స్ తో అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సీక్వెల్ ఎప్పటి నుండి మొదలు అవుతుంది అనే దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు. ‘స్పిరిట్’ మూవీ పూర్తి అయ్యాక ఈ చిత్రం మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
‘కల్కి’ లాగానే ‘కల్కి 2’ లో కూడా పాన్ ఇండియా లెవెల్ లో నటీనటులు ఉంటారట. కల్కి చిత్రం లో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, ‘కల్కి 2’ లో ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ లో కనిపిస్తాడట. అందుతున్న మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం లో మహాభారతం లోని కురుక్షేత్రం యుద్ధ ఘటన ఒక 30 నిమిషాల వరకు చూపిస్తారట. ఇందులో భీష్మ పితామహుడు క్యారక్టర్ కూడా కనిపిస్తుందట. ఈ పాత్రలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. కమల్ హాసన్ ఎలాగో ‘కల్కి 2’ లో మెయిన్ విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. రజినీకాంత్ కూడా అదే సినిమాలో కీలక పాత్రలో కనిపించడం అరుదుగా జరిగే సంఘటన. ఓవరాల్ గా ఇండియా లో ఉండే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ ఈ క్రేజీ సీక్వెల్ లో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాదు, కల్కి గా కనిపించబోయేది కూడా ఒక స్టార్ హీరో అని తెలుస్తోంది. ఎవరు ఆ స్టార్ హీరో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ క్యారక్టర్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్, ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇకపోతే పార్ట్ 1 లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే పార్ట్ 2 నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానం లో సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.