Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హాలీవుడ్ హీరో కి సరిసమానమైన లుక్స్ మరియు కటౌట్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటేంత ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన కేవలం తన టాలెంట్ ని మరియు అందాన్ని తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం చేసాడు. ఇప్పుడు త్వరలోనే ఆయన దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటించబోతున్నాడు.
#RRR చిత్రం తో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టి, ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతుండడం అభిమానులకు మామూలు కిక్ ఇవ్వట్లేదు. ఈ చిత్రం ఆగష్టు 9 వ తారీఖున మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది. ఇదంతా పక్కన పెడితే మహేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓటీటీ రంగం లో అగ్రస్థానం లో కొనసాగుతున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేసేందుకు అగ్రిమెంట్ కుదిరించుకుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఎవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ డైరెక్టర్ రుసో బ్రదర్స్ దర్శకత్వం వహించబోతున్నట్టు టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఒప్పుకున్నందుకు గాను, మహేష్ కి వంద కోట్ల రూపాయిలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.
తమ అభిమాన హీరో ఆలస్యం అయినా కూడా చేరాల్సిన చోటుకి చేరిపోయినందుకు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత ఆయన రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవుతాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయినా తర్వాతే ఆయన ఈ హాలీవుడ్ చిత్రం గురించి ఆలోచించే అవకాశం ఉంది.