https://oktelugu.com/

Mahesh Babu: శ్రీ రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి ప్లానింగ్ కి దండం పెట్టొచ్చు!

ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ జానర్ లో ఇండియాలో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదని ఇలా ఎన్నో రకాల వార్తలను మనం విన్నాం. ఇందుకోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేయడం వంటివి మనం చూసాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 09:11 PM IST

    Mahesh Babu-Rajamouli movie

    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఆయన అభిమానులు శ్రీ రాముడి పాత్రలో, లేదా శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. డైరెక్టర్ రాజమౌళి మహాభారతం తీస్తే కచ్చితంగా శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు తోనే చెయ్యిస్తాడని అందరికీ తెలుసు. ఆ పాత్ర ఆయనకీ తప్ప నేటి తరంలో ఏ హీరో కి కూడా సూట్ అవ్వదు. అయితే రాజమౌళి విజన్ లో ఉండే మహాభారతం కథ సిద్దమై, రెగ్యులర్ షూటింగ్ కార్య రూపం దాల్చడానికి కనీసం ఆరేళ్ళ సమయం పడుతుంది. ఈలోపు ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు ని శ్రీరాముడి అవతారం లో చూపించే ప్రయత్నం చేయబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా మొదలు అవ్వబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్న రాజమౌళి, ఫిబ్రవరి రెండవ వారం లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ జానర్ లో ఇండియాలో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదని ఇలా ఎన్నో రకాల వార్తలను మనం విన్నాం. ఇందుకోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేయడం వంటివి మనం చూసాము. అయితే ఈ సినిమాలోని ఒక్క సందర్భంలో మహేష్ బాబు ని శ్రీ రాముడి అవతారం లో చూపించబోతున్నాడట రాజమౌళి. #RRR మూవీ లో రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు గెటప్ లో చూపించినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అల్లూరి లుక్ లో కనిపించిన రామ్ చరణ్ ని నార్త్ ఇండియన్స్ శ్రీ రాముడి లుక్ తో పోల్చి చూసారు. మహేష్ ని కూడా తన సినిమాలో అదే విధంగా ఒక సన్నివేశంలో చూపించబోతున్నాడట రాజమౌళి. #RRR లో రామ్ చరణ్ ని ఆ గెటప్ లో చూసినప్పుడు ఆడియన్స్ కి ఎలాంటి గొప్ప అనుభూతి కలిగిందో, మహేష్ ని చూసినప్పుడు అంతకు పది రెట్లు గొప్ప అనుభూతి కలిగించేలా రాజమౌళి తీర్చి దిద్దబోతున్నాడట.

    ఈ సినిమా బ్యాక్ డ్రాప్ వారణాసి నుండి మొదలు అవుతుందట. అందుకే హైదరాబాద్ లో వారణాసి సెట్స్ వేసే పనిలో ప్రస్తుతం టీం ఉందట. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ అంటున్నారు, మళ్ళీ వారణాసి బ్యాక్ డ్రాప్ అంటున్నారు ఎందుకు?, మహేష్ ని శ్రీ రాముడిగా చూపించాల్సిన అవసరం ఏమిటి? వంటి ప్రశ్నలకు రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇవ్వాలి. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, మీడియా కి తన సినిమా స్టోరీ ని వివరించే అలవాటు రాజమౌళి కి ఉంది. ఈ సినిమాకి కూడా జనవరి నెలలో ఇలాంటి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడు రాజమౌళి. న్యూ ఇయర్ రోజున ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చే అవకాశం ఉందట.