Cinema Viral : తమిళ తెర పై తమిళ ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేసిన హీరోల్లో అజిత్ ఒకడు. విభిన్న శైలితో పాటు బాక్సాఫీస్ పై అజిత్ కి ఉన్న పట్టు మరో తమిళ హీరోకి లేదు. విజయ్ నెంబర్ వన్ హీరో అంటారు గానీ, అజిత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కి లేదు. అందుకే.. అజిత్ అంటే.. తమిళనాడులో ప్రత్యేమైన అభిమానం ఉంది.
ఏ వినూత్న సినిమా తీసినా ఆ కథలో తన పాత్రతో తమిళ ప్రజలను అలరిస్తూ వస్తున్న ఈ స్టార్ హీరో సినిమాలో ఇప్పుడు మరో స్టార్ నటించబోతున్నాడు. అవును నిజమే, ఆ స్టార్ మోహన్ లాల్. ఏ భాషలో ఏ పాత్రైనా సరే తనదైన శైలిలో ప్రేక్షకుల మన్ననలు పొందుతారు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్.
Also Read: ఎంజీఆర్ ఆ గొప్ప నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు !
అయితే తాజాగా ఆయన అజిత్ హీరోగా వస్తున్న తమిళ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజిత్ 61వ చిత్రంలో ముఖ్య పాత్రల్లో మోహన్ లాల్ నటించనున్నారని కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్.
అయితే ఈ చిత్రం లో తమిళ హీరో అజిత్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తమిళ పవర్ స్టార్ చిత్రంలో మలయాళీ సూపర్ స్టార్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ప్రచారం అవుతుంది. ఇక మోహన్ లాల్ గతంలో సూర్య హీరోగా వచ్చిన సినిమాలో నటించాడు.
ఇక తెలుగు విషయానికి వస్తే.. మోహన్ లాల్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: ఇందుకే కాంగ్రెస్ ఓడేది.. రేవంత్ రెడ్డి మొర ఆలకించండయ్యా?