https://oktelugu.com/

Pushpa Movie: పుష్ప ప్రమోషన్స్ కోసం అలా చేశారా.. అందుకే క్రికెటర్లు డాన్స్ చేస్తున్నారా..?

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’వసూళ్లలో దూసుకుపోతున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ ఫిల్మ్ వసూళ్ల పరంగా అప్పుడే రూ.300 కోట్ల క్లబ్ లో చేరిపోయిందంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇటీవల కాలంలో ఈ పిక్చర్ ప్రమోషన్స్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘పుష్ప’ పిక్చర్ డైలాగ్స్, సాంగ్స్‌ను […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 31, 2022 / 01:55 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’వసూళ్లలో దూసుకుపోతున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ ఫిల్మ్ వసూళ్ల పరంగా అప్పుడే రూ.300 కోట్ల క్లబ్ లో చేరిపోయిందంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇటీవల కాలంలో ఈ పిక్చర్ ప్రమోషన్స్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    Pushpa

    ‘పుష్ప’ పిక్చర్ డైలాగ్స్, సాంగ్స్‌ను మూవీ యూనిట్ సభ్యులే కాదు.. సెలబ్రిటీలు, క్రికెటర్లు బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో తెలుగు భాషలోనే కాదు. ఇండియాలోని అన్ని భాషల్లో ఈ చిత్రానికి బా గా క్రేజ్ ఏర్పడింది. అలా ఈ మూవీ బ్లాక్ బాస్టర్ కా బాప్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిత్ర రీల్స్ యే కనబడుతున్నాయి. శ్రీవల్లి సాంగ్ స్టెప్స్, తగ్గేదేలే అంటూ డైలాగ్స్, యాజ్ ఇట్ ఈజ్ బన్నీ మాదిరి స్టెప్స్ కనబడుతున్నాయి.

    Also Read: కేంద్రాన్ని ఇరుకునపెట్టే టీఆర్ఎస్ ప్లాన్?

    హుక్ స్టెప్స్ ను ప్రతీ ఒక్కరు చేసేస్తున్నారు. అలా ‘పుష్ప’లోని ప్రతీ సీన్ బాగా హైలైట్ అవుతున్నది. ఆస్ట్రేలియా ఓపెనర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఈ సినిమాకు ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం ‘తగ్గేదేలే’ అంటూ ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రెచ్చిపోతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ క్రికెటర్ వికెట్ తీసిన వెంటనే ‘తగ్గేదే లే’ అని అన్నాడంటే చిత్రం ఎంతలా ప్రమోట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

    Pushpa

    ‘పుష్ప’ మూవీ ప్రజెంట్ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్’లో టెలికాస్ట్ అవుతున్న నేపథ్యంలో అమెజాన్ వారు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కు డబ్బులిచ్చి మరీ ప్రమోట్ చేయిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కేవలం చిత్రం చూసి తమకు నచ్చి క్రికెటర్స్ అలా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ మాత్రమే కాదు ఇండియన్ క్రికెటర్స్ కూడా ఇన్ స్టా రీల్స్ లో ‘పుష్ప’ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ ను చూసి నెటిజన్లు ప్రమోషన్స్ లోనూ ‘తగ్గేదేలే’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏంటిది పుష్ప వేరే లెవల్ ప్రమోషన్స్’ అని పోస్టులు పెడుతున్నారు. ‘పుష్ప: పార్ట్ 2’పైన భారీ అంచనాలే ఉన్న సంగతి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.

    Also Read:‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ కి కారణం ఆమె.. సుమన్ దాతృత్వ గుణం వైరల్ !

    Tags