https://oktelugu.com/

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మహేష్ బాబు…

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సిరివెన్నెల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో కిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ చివరకు ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 31న […]

Written By: , Updated On : December 1, 2021 / 10:59 AM IST
Follow us on

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సిరివెన్నెల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో కిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ చివరకు ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 31న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సిరివెన్నెల. ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీప్రముఖులు సందర్శనాంర్ధం ఫిలింఛాంబర్ కు తరలించారు.

super star mahesh babu pays condolence to sirivennela seetharama sastry

ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాని, రానా, మురళీమోహన్ వంటి ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించున్నారు. ఆయన భౌతికకాయానికి మహేష్ నివాళి అర్పించారు. సిరివెనెన్ల గారి లేని లోతు తీర్చలేనిది అని మహేష్ బాబు అన్నారు. తెలుగు సాహిత్యలోకంలో సిరివెన్నెల గారు ముద్ర అమూల్యమైనదని మహేష్ వాపోయారు. ఒక లెజెండ్ ని కోల్పోయామని వి మిస్ యూ సార్, రెస్ట్ ఇన్ పీస్ అని మహేష్ బాబు చెప్పారు. కాగా మహేష్ నటించిన చాలా సినిమాలకు సిరివెన్నెల పాటలు రాసారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సిరివెన్నెల కుటుంబసభ్యులను పరామర్శించారు మహేష్.