https://oktelugu.com/

Paddy Grain Procurement: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?

Paddy Grain Procurement: తెలంగాణ రోడ్లపై,కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి యాసంగి పంట మొదలు పెట్టే రైతులు వానకాలం పంటను ఇంకా అమ్ముకోలేదు. అందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే కారణం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మెలికలు పెడుతోందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. వానకాలం పంటను ఎలాగైనా కొంటామని, అయితే యాసంగి పంటను కొనుగోళ్లు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 / 11:00 AM IST
    Follow us on

    Paddy Grain Procurement: తెలంగాణ రోడ్లపై,కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి యాసంగి పంట మొదలు పెట్టే రైతులు వానకాలం పంటను ఇంకా అమ్ముకోలేదు. అందుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే కారణం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మెలికలు పెడుతోందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. వానకాలం పంటను ఎలాగైనా కొంటామని, అయితే యాసంగి పంటను కొనుగోళ్లు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. అయితే యాసంగి పరిస్థితిని పక్కనబెడితే వానకాలం పంటను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు జరిపినా తేమ పేరుతో కిలోల లెక్కన కటింగ్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

    Paddy Grain Procurement

    వానకాలం పంటను కొటామని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను 6000 నుంచి 6300 వరకు పెంచామని అంటోంది. అయితే ప్రస్తుతానికి 4500 కేంద్రాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా అక్టోబర్ ముగిసే వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ధ నుంచి ధాన్యాన్ని కొంటారు. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారం వచ్చినా ఇంకా ధాన్యొ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తేమతో మొలకెత్తుతోంది. ఇందుకు తోడు అకాల వర్షాలతో పంట ధాన్యం తడిసిపోతుంది. కాగా కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 17 శాతం కంటే తేమ ఎక్కువగా వాటిని కొనుగోలు చేయడం లేదు.

    ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెలిక పెడుతోందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. దేశంలో ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యాక్షన్ ప్లాన్ వేస్తోంది. ఈసంవత్సరం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని తెలిపింది. అయితే ఏ ఏడాది తెలంగాణలో అనుకున్న దానికంటే ధాన్యం ఉత్పత్తి పెరిగింది. సుమారు కోటి లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పడింది. అందులో 58 లక్షలు కేంద్రం కొనుగోలు చేసినా మిగతాది రైస్ మిల్లర్స్ కు 20 నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగా.. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అయితే 2020-21 లో కోటి 41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని సీఎం కేసీఆర్ ఇటీవల తెలిపారు.

    Also Read: Minimum Support Price Act : కనీస మద్దతుధర చట్టంపై ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు.. రైతుల డిమాండ్ ఏమిటి..?

    వాస్తవానికి తెలంగాణ జనాభా అవసరాలకు పంట నష్టం తదితర అవసరాలకు 25 లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. ఎఫ్ సీఐ కి 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తే మొత్తంగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు పండించాలి. కానీ ఈసారి తెలంగాణలో దాదాపు కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండింది. అంటే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి అయింది. దీంతో మిగిలిన పంట కొనుగోలుపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరుద్యం దానిని ఏం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి.

    అయితే ప్రతి వరి ధాన్యం గింజ కొంటామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటనలు చేశారు. మరోవైపు సాగునీరు పుష్కలంగా అందించి వరి పంటను ప్రోత్సహించారు. దీంతో రైతులు వరి పంటను ఎక్కువగా వేశారు. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధంతో రైతులు నష్టపోతున్నారని అంటున్నారు. అయితే ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందిన తరువాత కేసీఆర్ ఇలాంటి రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. కేంద్రం కొనుగోలు చేయనప్పుడు ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

    Also Read: KCR: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

    Tags