https://oktelugu.com/

హైప్ పెంచేందుకు సూపర్ స్కెచ్ వేసిన బిగ్ బాస్ !

బిగ్ బాస్ తెలుగు -4 సీజన్ ముగిసేందుకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా.. షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లు సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్‌కి మరో నాలుగు రోజుల్లో తెరపడబోతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఉండటంతో హారిక, అరియానా, అభిజిత్, అఖిల్, సొహైల్‌లో ఫైనల్‌లో టైటిల్ కోసం పోరాడుతున్నారు. 102 ఎపిసోడ్ లో హీటు పెంచేందుకు గాను ఐదుగురు కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీని బిగ్ బాస్ ఏవీల […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 03:05 PM IST
    Follow us on


    బిగ్ బాస్ తెలుగు -4 సీజన్ ముగిసేందుకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా.. షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లు సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్‌కి మరో నాలుగు రోజుల్లో తెరపడబోతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఉండటంతో హారిక, అరియానా, అభిజిత్, అఖిల్, సొహైల్‌లో ఫైనల్‌లో టైటిల్ కోసం పోరాడుతున్నారు. 102 ఎపిసోడ్ లో హీటు పెంచేందుకు గాను ఐదుగురు కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీని బిగ్ బాస్ ఏవీల రూపంలో ప్లే చేసి చూయించి తనదైన శైలిలో పొగడ్తలు మరియు విమర్శలు చేసాడు.

    Also Read: వెండితెర పై సంక్రాంతి సందడి ఉంటుందా?

    ఇది చివరి వారం కనుక ఇక పెర్ఫామెన్స్‌తో షోలో ఆసక్తికరంగా చేయటానికి ఏమీ ఉండదు. చేయాల్సిందంతా చేసేసారు, ఇక పీకాల్సింది ఏమి లేక బిగ్ బాస్ ఈ కొత్త ఎత్తుగడ వేశారు. ఇప్పుడంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. గత 14 వారాల ఆటను ప్రేక్షకుల ముందుంచి రేటింగ్స్ పెంచుకునే ప్రత్నం చేశారు. ఇక మొదటిగా ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ ఎమోషనల్ జర్నీని చూపించారు. అఖిల్ గురించి అద్భుతంగా మాట్లాడిన బిగ్ బాస్ అతనిలో కాన్ఫిడెన్స్ నింపారు. ఫైనల్ ఎపిసోడ్ ఇచ్చే ఎలివేషన్స్‌తో లైఫ్‌లో గుర్తిండిపోయే ఎక్స్ పీరియన్స్‌ని బిగ్ బాస్ అందించడంతో భావోద్వేగానికి గురయ్యాడు అఖిల్. ముఖ్యంగా అఖిల్ ఎమోషనల్ జర్నీ వీడియో హైలైట్ అయ్యింది. చివర్లో నీకు నచ్చిన ఫొటోని తీసుకుని లోపలికి వెళ్లమని బిగ్ బాస్ చెప్పగా… టికెట్ టు ఫినాలే మెడల్ సాధించిన ఫొటోని తీసుకుని హౌస్‌లోకి వెళ్లాడు.

    Also Read: ఆర్ఆర్ఆర్ కోసం రిస్కీ స్టంట్ చేసిన రాజమౌళి

    అభిజిత్ వీడియో ప్లే చేయగా…యంగ్ చార్మింగ్ బాయ్‌లా వచ్చిన అభిజిత్.. ఎన్నో ప్రశంసలు అందుకుంటూ మెచ్యూర్డ్ మ్యాన్ ఇన్ ది హౌస్ అనే టైటిల్ కూడా సాధించారని చెప్పారు బిగ్ బాస్. కొన్ని సందర్భాల్లో మీలో మీరు కుమిలిపోయారని.. ఆ భావోద్వేగాన్ని ఎవరి ముందు చూపించలేదని దాని వలన చాలా ఎక్కువ బాధపడ్డారని.. లేనిపోని అపార్ధాలు ఉండొచ్చు.. మిగిలిన వాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా.. మీరు మాత్రం అన్నింటిని తట్టుకుని ఉన్నారు. మీరు మీకంటే ఎక్కువగా వేరే వాళ్ల గురించి ఆలోచించి.. వాళ్లకి మర్యాద ఇచ్చారు.. తిరిగి పొందుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా.. నిలకడ కోల్పోకుండా షో మొత్తం కొనసాగించారు అని చెప్పారు బిగ్ బాస్. నీలాంటి పరపక్వత కలిగిన తెలివైన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందుకు బిగ్ బాస్ చాలా గర్వపడుతున్నాడని చెప్పారు బిగ్ బాస్. అనంతరం అభిజిత్ జర్నీ మొత్తాన్ని వీడియో రూపంలో చూపించారు బిగ్ బాస్. అనంతరం అభిజిత్ మాట్లాడుతూ…నా లైఫ్‌లో నేను తీసుకున్న ఉన్నతమైన నిర్ణయం ఇదే అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. మిగిలిన కంటెస్టెంట్స్ వీడియోస్ ఈ రోజు ఎపిసోడ్ లో ప్లే చేసేలా ప్లాన్ చేసాడు. అఖిల్, అభిజిత్ వీడియోస్ తో ఎమోషన్స్ పుట్టించి ఆసక్తికరంగా మార్చి రేటింగ్స్ తీసుకురావాలనే మాస్టర్ ప్లాన్ లో విజయం సాధించాడు బిగ్ బాస్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్