Super singer grand finale: సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే… విన్నర్ అయ్యేది ఎవరు?

ఒకరిని మించి మరొకరు వారి గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే కు స్పెషల్ గెస్ట్ గా తమన్ వచ్చారు. ఇక శ్రీముఖి యాంకరింగ్ .. జడ్జెస్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, అనంత్ శ్రీరామ్, శ్వేత మోహన్...

Written By: S Reddy, Updated On : March 15, 2024 10:53 am

Super-singer-grand-finale

Follow us on

Super singer grand finale: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో ఫినాలే కు చేరుకుంది. గత ఏడాది డిసెంబర్ 23న 16 మంది సింగర్స్ తో ప్రారంభం అయిన రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. 13 వారాలుగా సంగీత ప్రియులను ఈ షో ఎంతగానో అలరించింది. ఈ క్రమంలో విన్నర్ గా ఎవరు నిలుస్తారనే ఆసక్తి నెలకొంది. తాజాగా సూపర్ సింగర్ ఫినాలే ప్రోమో విడుదలయింది. ఇప్పటివరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చిన టాప్ 6 సింగర్స్ తమ మెస్మరైజింగ్ పాటలతో సిద్ధంగా ఉన్నారు.

ఒకరిని మించి మరొకరు వారి గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే కు స్పెషల్ గెస్ట్ గా తమన్ వచ్చారు. ఇక శ్రీముఖి యాంకరింగ్ .. జడ్జెస్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, అనంత్ శ్రీరామ్, శ్వేత మోహన్ లు స్పెషల్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఫినాలే ప్రోమో రావడంతో ఆరుగురులో విన్నర్ ఎవరనే ఉత్కంఠ పెరుగుతుంది. అయితే నెటిజన్లు మాత్రం విన్నర్ పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయారు. కచ్చితంగా విన్నర్ పవన్ కళ్యాణ్ .. నో డౌట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే సింగర్ ప్రవస్తి నుంచి పవన్ కళ్యాణ్ కి గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పవచ్చు. అయినా కూడా విన్నర్ అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన విన్నర్ – పవన్ కళ్యాణ్, రన్నర్ -ప్రవస్తి, మూడో స్థానం – అమిత, నాలుగో స్థానం – శ్వేత, ఐదో స్థానం – సుమనస్, ఆరో స్థానంలో సాహితి ఉంటారని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో జీ తెలుగులో ప్రసారమైన సరిగమప షో లో పాల్గొన్నాడు.

సూపర్ సింగర్ షో తో మరోసారి తన అద్భుతమైన ట్యాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. గత వారం పవన్ కళ్యాణ్ ‘నువ్వుంటే నా జతగా ‘ అంటూ పాడిన పాట నెక్స్ట్ లెవల్. జడ్జెస్ తో పాటు గెస్ట్ గా వచ్చిన కోటి గారు ప్రశంసలతో ముంచెత్తారు. అంత బాగా ఆ పాటను దించేసాడు. దీంతో విన్నర్ పవన్ కళ్యాణ్ అని అంతా భావిస్తున్నారు. సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మార్చి 16, 17 తేదీల్లో సాయంత్రం 9 గంటలకు ప్రసారం కానుంది.