https://oktelugu.com/

Super Man Trailer Review: సూపర్ మ్యాన్ ట్రైలర్ లో ఆ ఒక్క షాట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవల్ అంతే…

హాలీవుడ్ సినిమాల గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రతి సినిమా ప్రేక్షకుడికి హాలీవుడ్ సినిమాలు అందించే విజువల్ ఫీస్ట్ ను మరే సినిమాలు అందించవని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు హాలీవుడ్ సినిమాలకి అడిక్ట్ అవ్వకుండా ఉండలేడు...

Written By:
  • S Reddy
  • , Updated On : December 20, 2024 / 12:32 PM IST

    Super Man Trailer Review

    Follow us on

    Super Man Trailer Review: ఇక హాలీవుడ్ సినిమాలా విషయానికి వస్తే వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ నెక్స్ట్ లెవల్లో కనిపిస్తారు…ఎందుకంటే వాళ్లు విజువల్ గా స్క్రీన్ మీద వండర్స్ ని చూపిస్తారు. ఇక అది చూసిన ప్రతి ప్రేక్షకుడు తను ఆ సినిమా మీద పెట్టిన టికెట్ డబ్బులకి వర్త్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందువల్లే మన సినిమాలు ఇవ్వలేని ఇంపాక్ట్ ని హాలీవుడ్ సినిమాలు ఇస్తూ మన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం సూపర్ మ్యాన్ సినిమా నుంచి కొత్త ట్రైలర్ వచ్చింది. పిల్లలకు చాలా ఇష్టమైన ఈ సూపర్ మ్యాన్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించడానికి బాక్స్ ఆఫిస్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లైతే విజువల్ ఫీస్ట్ గా మరోసారి ఈ ట్రైలర్ ని రూపొందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన ఈ సూపర్ మాన్ ప్రేక్షకుల్ని మాత్ర ముగ్ధుల్ని చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది విజువల్స్ గానే కాకుండా ఈ ట్రైలర్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్ గా తీసుకెళ్లడనే చెప్పాలి. ఇక సూపర్ మ్యాన్ ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఒక కుక్క వచ్చే అతనికి హెల్ప్ చేసే షార్ట్ అయితే ఈ ట్రైలర్ మొత్తంలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది.

    అలాగే తను ఎవరినైతే సేవ్ చేయాలని చూస్తున్నాడో వాళ్ళందరిని సేవ్ చేస్తూ సూపర్ మాన్ ముందుకు సాగుతూ ఉండడం అనేది కూడా ట్రైలర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల ట్రైలర్ మొత్తానికి భారీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది…

    ఇక హాలీవుడ్ సినిమాల్లో ఎలాగో కొన్ని ఎలివేషన్స్ తాలూకు షాట్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఈ ట్రైలర్ ను చూస్తే చాలా ఈజీగా అర్థం అవుతుంది…ఇక ప్రతి విషయంలో వాటిని రిప్రజెంట్ చేసే విధంగా జేమ్స్ గన్ ఈ ట్రైలర్ లో కొంతవరకు ప్రయత్నం అయితే చేశాడు… డేవిడ్ కోరెన్ స్వెట్ సూపర్ మ్యాన్ గా మొదటి సారి అలరించడానికి రెఢీ అవుతున్నాడు…

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ రికార్డులను కొల్లగొట్టబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక జులై 11వ తేదీన ఈ సినిమా థియేటర్ లోకి రాబోతున్న నేపధ్యంలో ఇప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది యావత్ ప్రపంచంలో ఉన్న సినిమా ప్రేక్షకులందరికి సూపర్ మాన్ సినిమా వస్తుందని చెప్పడానికే ఇలాంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది…