Roshan Kanakala: రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెరను ఏలుతున్న సుమ కనకాల తన కుమారుడు రోషన్ ని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ పేరుతో రోషన్ డెబ్యూ మూవీ విడుదలైంది. బబుల్ గమ్ ఇంటెన్స్ లవ్ డ్రామా తెరకెక్కింది. ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకుడు. ఇండస్ట్రీలో గట్టి పరిచయాలున్న సుమ… తన కుమారుడు డెబ్యూ మూవీని పెద్దోళ్ళతో ప్రమోట్ చేయించింది. టాలీవుడ్ ప్రముఖులు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. 2023లో విడుదలైన బబుల్ గమ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు.
రోషన్ నటనకు మార్కులు పడ్డాయి. లుక్స్ పరంగా మిక్స్డ్ టాక్ వినిపించింది. నటుడిగా పర్లేదు అనిపించుకున్న రోషన్ రెండో ప్రాజెక్ట్ కి సిద్ధం అయ్యాడు. రోషన్ కొత్త మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ముఖ్య అతిథిగా సందీప్ రెడ్డి వంగ రావడం విశేషం. కాగా ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకుడు. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సందీప్ రాజ్. సుహాస్ హీరోగా తెరకెక్కిన ట్రాజిక్ లవ్ డ్రామా కలర్ ఫోటో నేరుగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్ లో విడుదల చేస్తే సందీప్ రాజ్ కెరీర్ కి ఆ సినిమా చాలా ప్లస్ అయ్యేది.
ఏదేమైనా కలర్ ఫోటో మూవీతో సందీప్ రాజ్ వెలుగులోకి వచ్చాడు. రోషన్-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రోషన్ కి జంటగా ముంబై భామ సాక్షి సాగర్ నటిస్తుంది. ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ నిర్ణయించారని సమాచారం. టైటిల్ చాలా భిన్నంగా ఉంది. కామిక్ స్టోరీస్ లో క్యారెక్టర్ నేమ్ వలె ఉంది.
మరి రెండో చిత్రంతో అయిన రోషన్ కమర్షియల్ హిట్ కొడతాడేమో చూడాలి. యాంకర్ గా కోట్ల రూపాయలు సంపాదించిన సుమ ఎలాగైనా కొడుకును హీరోగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సుమ భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నాడు. రాజీవ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. సుమ, రాజీవ్ నుండి రోషన్ కి గట్టి మద్దతు ఉంది. నటుడిగా ప్రేక్షకులను మెప్పించగలిగితే ఒక స్థాయి హీరోగా నిలదొక్కుకోవచ్చు.